విజయానికి.. కష్టపడొద్దు!

కష్టపడి పనిచేయడంలో అమ్మాయిలే ముందున్నారని పలు పరిశోధనలు రుజువు చేశాయి. కెరియర్‌ కొత్తలో గంటలకొద్దీ పనిచేస్తాం సరే! తర్వాత అదనపు బాధ్యతలు జోడవుతాయి కదా! మరప్పుడు?

Published : 06 Jun 2022 01:24 IST

కష్టపడి పనిచేయడంలో అమ్మాయిలే ముందున్నారని పలు పరిశోధనలు రుజువు చేశాయి. కెరియర్‌ కొత్తలో గంటలకొద్దీ పనిచేస్తాం సరే! తర్వాత అదనపు బాధ్యతలు జోడవుతాయి కదా! మరప్పుడు? అందుకే పని చేసే విధానంలో కొన్ని మార్పులు చేసుకోమంటున్నారు నిపుణులు.

పని పూర్తయ్యాక చాలాసార్లు ‘ఇన్ని గంటలు, రోజులు కష్టపడ్డా’ అంటాం. అందుకే ఫలితం సంతృప్తినిస్తుంది. కానీ ఈ ‘కష్టం’ ఇలానే కొనసాగితే కాలం గడిచేకొద్దీ నిస్సత్తువ, నిరాశలకీ కారణమవుతుంది. పని చేతికి రాగానే వెంటనే దిగిపోకండి. సులువుగా, తక్కువ టైమ్‌లో చేసే మార్గాలను వెతకండి. సీనియర్ల సలహాలూ సాయపడతాయి. దానికి మీ సృజనాత్మకత జోడిస్తే సరి.

* ఒకదాని తర్వాత ఒకటి అన్న పద్ధతిలో వెళ్లొద్దు. వీలైనంత తక్కువ దశల్లో పూర్తిచేసేలా చూసుకోండి.

* ‘విజయం సాధించాలంటే హద్దులు పెట్టుకోవద్దు..’ అని వింటుంటాం. వాటిని పక్కన పడేయండి. పని, వ్యక్తిగత జీవితం, సరదాలు.. అన్నింటికీ సమయం పెట్టుకోండి. మనసు ఉల్లాసంగా ఉండాలన్నా, బంధాలు కొనసాగాలన్నా సమయం ఇవ్వాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్