ఓటమీ పాఠమే!

చదువైనా, ఉద్యోగమైనా.. ఓడిపోవడం మనకు నచ్చదు. అది ఎదురైతే ఆగిపోవాల్సి వస్తుందన్న భయం. అందుకే చాలా శ్రమ పడుతుంటాం. విఫలమైతే బాధపడుతుంటాం. కానీ ఓటమిని విజయసోపానంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నారు నిపుణులు...

Published : 19 Jun 2022 01:07 IST

చదువైనా, ఉద్యోగమైనా.. ఓడిపోవడం మనకు నచ్చదు. అది ఎదురైతే ఆగిపోవాల్సి వస్తుందన్న భయం. అందుకే చాలా శ్రమ పడుతుంటాం. విఫలమైతే బాధపడుతుంటాం. కానీ ఓటమిని విజయసోపానంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నారు నిపుణులు...

* వైఫల్యానికి కుంగిపోవద్దు. లక్ష్యాన్ని గుర్తుచేసుకోవాలి. గతంలోదే అయితే ఎక్కడ వెనకబడ్డారో చూసుకోవాలి. కొత్తది ఏర్పరచుకుంటే దాన్ని అందుకునే మార్గాలను అన్వేషించుకోవాలి.

* మన చుట్టూ మంచి, చెడూ రెండు మనస్తత్వాల వారూ ఉంటారు.. కానీ కొందరి ఆలోచనలు, మాటలు మనపై ఎక్కువ నెగెటివ్‌ ప్రభావం చూపుతుంటాయి. అలాంటివారిని పక్కన పెట్టేయండి. దేని విషయంలోనైనా నమ్మకం ఉంటే నిరభ్యంతరంగా ప్రయత్నించండి. ఎవరో చెప్పారని ఆగిపోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి.

* సీనియర్ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి. కచ్చితంగా మీ గురించి తెలిసి, మీకు నమ్మకం ఉన్నవారినే అడగండి. బాధించేలా ఉన్నా దాన్ని సీరియస్‌గా తీసుకోండి. దాని ఆధారంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి.

* ఓటమికి కారణాలను రాసుకొని కనిపించే చోట అతికించుకోండి. ఏ పనిలో ఉన్నా అప్పుడప్పుడూ దాన్ని చూడండి. తిరిగి వాటిని చేయకుండా చూసుకోండి. గెలవాలన్న తపనతో ప్రతి అవకాశాన్నీ అందుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు రాజీపడాల్సి వస్తుంది. రెండూ తప్పే. పరిశోధన చేశాకే అడుగేయండి. నచ్చకపోతే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేయండి.

* మీతో కలిసి నడిచే వారితో మాత్రం సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ తేడా వచ్చినా అది మీ పనిపై ప్రభావం చూపుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్