ఆ మూడింటిని మరవొద్దు!

గత ఏడాది ‘షార్క్‌ట్యాంక్‌’ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా అవకాశమొచ్చినప్పుడు గర్భవతిని. పెరిగిన బరువు, హార్మోనుల్లో మార్పులు, వాచిన పాదాలు.. ప్రసవం దగ్గరవుతున్న కొద్దీ ఇంకా సమస్యలుంటాయి. మరిన్ని బాధ్యతలు తీసుకోగలనా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, ఇదీ ఒక సవాల్‌ కదా.. నన్ను నేను నిరూపించుకోవాలని అనిపించింది.

Published : 15 Oct 2022 00:54 IST

త ఏడాది ‘షార్క్‌ట్యాంక్‌’ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా అవకాశమొచ్చినప్పుడు గర్భవతిని. పెరిగిన బరువు, హార్మోనుల్లో మార్పులు, వాచిన పాదాలు.. ప్రసవం దగ్గరవుతున్న కొద్దీ ఇంకా సమస్యలుంటాయి. మరిన్ని బాధ్యతలు తీసుకోగలనా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, ఇదీ ఒక సవాల్‌ కదా.. నన్ను నేను నిరూపించుకోవాలని అనిపించింది. ప్రెగ్నెన్సీ కారణంగా కెరియర్‌ను పక్కన పెట్టాల్సిన అవసరం లేదని చూపాలనుకున్నా. నన్ను స్ఫూర్తిగా తీసుకున్నామంటూ మెసేజ్‌లు వస్తోంటే ఆనందంగా ఉంది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్రా ప్రధానమే. అయితే 3 విషయాలను మాత్రం విస్మరించొద్దు.

1. విజయం అంతిమ లక్ష్యం కాదు.. మరెన్నో సవాళ్లను ముందుంచే ఒక దశ మాత్రమే. అపజయాలని చూసి నాకు ఏమీ రాదనీ కుంగిపోవద్దు. శక్తి కొద్దీ ప్రయత్నిస్తా, సాధిస్తా అన్న ఆలోచనే ఎప్పుడూ తోడుండాలి. అదే ముందుకు నడిపిస్తుంది.

2. మల్టీటాస్కింగ్‌ మనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే అన్నింటినీ ఉత్తమంగా చేయాలన్న తపన, అలా చేయ లేకపోయాననే దిగులొద్దు. అందరికీ మొదటి ర్యాంకే రాదు కదా! ఇదీ అలాగే.. వీలైనంత బాగా చేస్తే చాలు.

3. బాధ్యతల్లో పడి మనల్ని మనం మర్చిపోతాం. అదే వద్దు. మీకు నచ్చింది చేయడానికి సమయం కేటాయించుకోండి. సృజనాత్మకతకు పని చెప్పండి. అది మనలో, చుట్టూ వాతావరణంలోని సానుకూలతను పరిచయం చేస్తుంది.

- గజల్‌ అలఘ్‌, సహ వ్యవస్థాపకురాలు, మామాఎర్త్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్