పరుగు సాగిపోవాలి

ఒకప్పుడు కాళ్లకు చెప్పుల్లేకుండా పరుగెత్తిన నేను... పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా మారే రోజుల వరకూ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపుల్ని చూశా. ముళ్లూ దాటి వచ్చా.

Published : 16 Oct 2022 00:34 IST

అనుభవ పాఠాలు

ఒకప్పుడు కాళ్లకు చెప్పుల్లేకుండా పరుగెత్తిన నేను... పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా మారే రోజుల వరకూ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపుల్ని చూశా. ముళ్లూ దాటి వచ్చా. అభినందనలూ అందుకున్నా. విమర్శల జడి వానలోనూ తడిచా. దేనికీ చలించకుండా ఉంటేనే గమ్యం చేరుకోగలం. ఇతరులెవరికీ మన కష్టం విలువ తెలియదు. అందుకే విమర్శిస్తూ ఉంటారు. ఎవరెంత ప్రతికూలంగా మాట్లాడినా... మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. నా దృష్టిలో అసలు వాటిని పట్టించుకోనవసరం లేదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఏం చేస్తున్నామో మనకి మాత్రం తప్పనిసరిగా తెలియాలి. ఇంట్లోనే కూర్చుని నేనేమీ చేయలేకపోతున్నా అనుకుంటే మాత్రం ఏమీ జరగదు. పరుగు నా అవసరాలను తీర్చింది. అవకాశాలనూ సృష్టించింది. అందుకే నా దృష్టిలో పరుగూ, జీవితం రెండూ ఒక్కటే. అవి సాగిపోవాలే కానీ ఎక్కడా ఆగిపోకూడదు. ఆ మధ్య నాకు కరోనా వచ్చినప్పుడు చచ్చిపోతానేమో అనిపించింది. దాంతో కిటికీలూ, తలుపులూ తీసి నిద్రపోయేదాన్ని. ఒక్కసారి భయం మనసులో నాటుకుంటే... మన ప్రతి అడుగులోనూ సందేహం మొదలవుతుంది. అందుకే ఆటలోనైనా, జీవితంలోనైనా విజయం సాధించడానికి ఆత్మస్థైర్యం ఎంతో అవసరం.

- హిమదాస్‌, అర్జున పురస్కార గ్రహీత, అథ్లెట్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్