లోపాల్ని అధిగమిస్తేనే...

కెరియర్‌లో రాణించాలని ప్రతి అమ్మాయీ కలలు కంటుంది. కానీ... నిజంగా ఏదైనా సవాల్‌ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు.

Published : 04 Nov 2022 01:11 IST

కెరియర్‌లో రాణించాలని ప్రతి అమ్మాయీ కలలు కంటుంది. కానీ... నిజంగా ఏదైనా సవాల్‌ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. దాంతో ఎదుగుదలకు అక్కడే అడ్డు పడుతుంది. ఈ ఇబ్బందిని దాటాలంటే...

* ఎవరో ఏదో అంటారని, విమర్శిస్తారని ఏ పనీ చేయొద్దు. మీరు నమ్మితే... అది ఎంత కష్టమైనా, ఎన్ని విమర్శలొచ్చినా ముందడుగు వేయండి. విజయం సాధిస్తే... మిమ్మల్ని వెక్కిరించిన నోటితోనే శభాష్‌ అంటారు. అలా కాకుండా భయపడితే మిమ్మల్ని మీరు కోల్పోతారు. భయం ఈ విషయంలోనే కాకుండా ప్రతి అడుగులోనూ కనిపించి మిమ్మల్ని వెనక్కి లాగుతుంది.

* విమర్శలకి భయపడొద్దు కానీ...వాటిని గమనించండి. కొన్ని పొరపాట్లని మీరు గుర్తించలేకపోయి ఉండొచ్చు కదా! వీలైతే...వాటికి పరిష్కారాలు వెతకండి. కొన్నిసార్లు వాటికి మీరు చూపించిన పరిష్కారాలే విజయానికి దగ్గర చేయొచ్చు.

* జయాపజయాల్ని మీ వ్యక్తిత్వం నుంచి వేరుగా చూడండి. మీరు ప్రయాణించే మార్గంలో పాతాళంలోకి పడిపోయినా సరే దాని ప్రభావం మీ వ్యక్తిత్వంపై పడకుండా చూసుకోండి. అప్పుడే పడిన చోట నుంచే మరింత వేగంగా పైకి వచ్చి నిలబడగలరు. కెరియర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్