ప్రయత్నిస్తేనే... ఫలితం

అబ్బాయిలతో సమానంగా... అమ్మాయిలూ కెరియర్‌లో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నారు. అయితే, అందరికీ మంచి మెంటార్‌ దొరక్కపోవచ్చు. ఇలాంటప్పుడు... మనకి మనమే తోడుగా ఉండాలి. ఇందుకీ పంచ సూత్రాలు పాటించాలని చెబుతున్నారు కెరియర్‌ నిపుణులు.

Updated : 09 Dec 2022 04:29 IST

అబ్బాయిలతో సమానంగా... అమ్మాయిలూ కెరియర్‌లో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నారు. అయితే, అందరికీ మంచి మెంటార్‌ దొరక్కపోవచ్చు. ఇలాంటప్పుడు... మనకి మనమే తోడుగా ఉండాలి. ఇందుకీ పంచ సూత్రాలు పాటించాలని చెబుతున్నారు కెరియర్‌ నిపుణులు.

అవగాహన అవసరం... ఎదగాలన్న తపన మాత్రం ఉంటే సరిపోదు. ప్రతి పనిపైనా పట్టు తెచ్చుకోవాలి. అందుకోసం ముందు మనం చేస్తున్న పని విధివిధానాలపై అవగాహన తెచ్చుకోవాలి. సీనియర్ల పనితీరునీ, బృందం సాధించిన విజయాలనీ తెలుసుకోవాలి. అప్పుడే మీరు ప్రణాళిక వేసుకోవడం సులువవుతుంది.

నెట్‌వర్క్‌ అవసరం... ప్రతిదీ నేనే చేయాలి. అన్నీ నాకే తెలుసు అనుకోవడం అతివిశ్వాసమే అవుతుంది. తోటివారితో సత్సంబంధాలు పెంచుకోండి. మీ పనిలో, మీ అభిరుచికి తోడయ్యే వ్యక్తులతో ఓ నెట్‌వర్క్‌ని ఏర్పరుచుకోండి.

నివృత్తి చేసుకోండి... పని చేస్తుంటేనే లోపాలు అర్థమవుతాయి. సందేహాలూ వస్తాయి. దాదాపు తొంభైశాతం మందికి తాము చేస్తున్న పనిపై ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న మనసులో మెదులుతూనే ఉంటుంది. అంటే దానర్థం మీకేమీ రాదని కాదు... మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ఉందని. ముందు నాకు ఏమీ తెలియదనే భావన నుంచి బయటపడాలి. ఆపై భయాల్ని దూరం చేసుకుని మనకు మనం సానుకూల లక్షణాలను ఆపాదించుకోవాలి.

ఎదుటివారినీ గుర్తించండి... మీరెంత గొప్ప విజయం సాధించారన్నది కాదు... ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు మీకెవరెవరు, ఏయే అంశాలు సాయపడ్డాయనేది గుర్తుంచుకోండి. మీరందుకున్న గెలుపు మీకెంత సంతోషాన్ని కలిగిస్తుందో! ఇతరుల విషయాన్నీ అంతే సానుకూలంగా తీసుకోండి. ఇతరుల విజయాన్ని గుర్తించడం ఎంత అవసరమో, మీ విజయంలో ఇతరుల పాత్ర ఉంటే... అభినం దించడం కూడా అంతే ముఖ్యం.

ప్రయత్నిస్తూనే ఉండండి... ఇది కాస్త కష్టమైన విషయమే కానీ,  సులువుగా ఏ విజయమూ సాధ్యపడదనే విషయం గుర్తుంచు కోగలిగితే దీన్ని సులువుగా పాటించ గలుగుతారు. పొరబాట్లను సరిదిద్దుకుని ముందడుగు వేయగలుగుతారు. అప్పుడు ఏ ఉద్యోగం చేసినా మీదైన శైలిలో ముద్ర వేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్