ఆయన ఒప్పుకొంటేనే...

సంపాదించడం సరే.. మరి సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం మహిళలకు ఉంటోందా? దీనికి సమాధానం కోసం ‘డీఎస్పీ మ్యూచువల్‌ ఫండ్‌ విన్‌వెస్టర్‌, యూగవ్‌ (పరిశోధన సంస్థ)’ సంయుక్తంగా ఒక అధ్యయనం చేశాయి.

Updated : 16 Dec 2022 01:13 IST

సంపాదించడం సరే.. మరి సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం మహిళలకు ఉంటోందా? దీనికి సమాధానం కోసం ‘డీఎస్పీ మ్యూచువల్‌ ఫండ్‌ విన్‌వెస్టర్‌, యూగవ్‌ (పరిశోధన సంస్థ)’ సంయుక్తంగా ఒక అధ్యయనం చేశాయి. అందులో తేలిన వాస్తవాలివి..

* సంపాదించే మహిళల్లో 44 శాతం మంది మాత్రమే పెట్టుబడుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారట. అదే మగవాళ్లైతే... 65 శాతం మంది ఎవరి జోక్యం లేకుండానే పెట్టుబడులు పెడుతున్నారు.

* ఆర్థిక నిర్ణయాల్లో 67 శాతం మంది కచ్చితంగా భర్త అనుమతి తీసుకుంటున్నారు. మరి మగవాళ్లు కూడా ఇంట్లో ఆడవాళ్ల అభిప్రాయం తీసుకుంటారా అంటే.. 40 శాతం మందే ఇంట్లో చెబుతారట.

* ఇక తండ్రి నిర్ణయాన్ని అనుసరించే విషయానికొస్తే.. మగవాళ్లే ఎక్కువగా తండ్రి నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆడవాళ్లు భర్త తర్వాతే తండ్రి అనుకుంటున్నారట.

* ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆడపిల్లలని పెంచేటప్పుడే, స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలని అంటున్నారు ఆర్థిక నిపుణురాలు అదితికొఠారీ దేశాయ్‌. ఈ సర్వేలో మరో ఆసక్తికర కోణమూ ఉంది. సొంతంగా పెట్టుబడులు పెడుతున్న మహిళల్లో అధికశాతం ఆర్థిక నిపుణుల సలహాలతోనే ముందడుగు వేస్తున్నారు.

* పిల్లల చదువులు, పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవితం కోసం ఆడవాళ్లు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కొవిడ్‌ తర్వాత ఆర్థిక నిర్ణయాల్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకొనే మహిళల సంఖ్య పెరిగిందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్