పని తగ్గితేనే... ఉత్పాదకత పెరుగుతుంది?

ఇదేంటి పని చేయకుండా ఉత్పాదకత ఎలా పెరుగుతుంది అంటారా? మన శక్తికి మించిన పనులు తలకెత్తుకోవడం, ఒకేసారి బోలెడన్ని విధులు నిర్వర్తించడం వంటివన్నీ ఇందుకు కారణాలంటారు కెరియర్‌ నిపుణులు.

Updated : 17 Dec 2022 01:21 IST

ఇదేంటి పని చేయకుండా ఉత్పాదకత ఎలా పెరుగుతుంది అంటారా? మన శక్తికి మించిన పనులు తలకెత్తుకోవడం, ఒకేసారి బోలెడన్ని విధులు నిర్వర్తించడం వంటివన్నీ ఇందుకు కారణాలంటారు కెరియర్‌ నిపుణులు. ముఖ్యంగా మహిళలు... ఎక్కువ పని ఒత్తిడితో సతమతమవుతున్నారంటూ... ఈ ఇబ్బందిని అధిగమించేందుకు సూచనలు చేస్తున్నారు.

* మహిళలు ఇటు ఇంటిపనులు చక్కదిద్ది,  భర్త, పిల్లల అవసరాలు తీర్చి... ఇతరత్రా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కాస్త ఒత్తిడికీ, అంతకు మించి అలసటకూ గురవుతుంటారు. దీనివల్ల చేసే పనిలో నాణ్యత దెబ్బతింటుంది.

* ఏకకాలంలో వేర్వేరు పనులు పూర్తి చేద్దాం అనుకుంటే... వాటి నాణ్యత ఎలా ఉంటుందన్నది సందేహమే. ఒకవేళ అందులో ఏ ఒక్క దాంట్లో విఫలం అయినా ఒత్తిడి మరింత పెరుగు తుంది. మల్టీ టాస్కింగ్‌ వల్ల కొన్ని సార్లు చేస్తోన్న పనుల మీద పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒత్తిడితో ఏకాగ్రతా దెబ్బ తింటుంది. అలా కాక ఒకదాని తర్వాత మరొకటి ప్రాధాన్యతా క్రమంలో చేయ గలిగితే సకాలంలో అన్నీ చక్కగా పూర్తవుతాయి. అయితే ఇందుకోసం కచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి.

* కొందరు మొహమాటానికి పోయి... ఇతరుల పనులూ నెత్తిన వేసుకుని చేస్తుంటారు. తరచూ ఇలాంటి అదనపు బాధ్యతల వల్ల కూడా తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా సరే... సొంత పనులు పూర్తయ్యాకే... అనే నియమం పెట్టుకోండి. ఇక,  ప్రతి పనికీ గుర్తింపు, మన ముద్ర కనిపించాలను కోవడం మంచిదే. అలాగని అన్నీ మీరొక్కరే చూసుకోవడం కష్టం కావొచ్చు. ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తించేలా చేయడమే అసలైన విజయం. అప్పుడు మీకూ ఒత్తిడి ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్