సవాళ్లను స్వాగతించండి!

ఈ తరం అమ్మాయిలు ర్యాంకులు సాధించడంలో, ఉద్యోగాలను అందుకోవడంలో ముందుంటున్నారు. కానీ పదోన్నతులనూ, నాయకత్వ బాధ్యతలనూ తీసుకోవడంలో మాత్రం వెనకే ఉంటున్నారు.

Published : 25 Dec 2022 00:34 IST

ఈ తరం అమ్మాయిలు ర్యాంకులు సాధించడంలో, ఉద్యోగాలను అందుకోవడంలో ముందుంటున్నారు. కానీ పదోన్నతులనూ, నాయకత్వ బాధ్యతలనూ తీసుకోవడంలో మాత్రం వెనకే ఉంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే... సవాళ్లను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

స్పష్టత అవసరం: ఆలోచనల్లో స్పష్టత ఉంటే... సగం సమస్యలు తీరినట్లే. కానీ అమ్మాయిలకు ఇల్లు, కుటుంబం, సమాజం.. ఇలా ఎన్నో విషయాలు ముందర కాళ్లకు బంధం వేస్తాయి. ముందు మీ పరిస్థితుల్ని అంచనా వేసుకోండి. ఉద్యోగం అవసరాన్నీ, మీ ప్యాషన్‌ని కూడా పరిగణనలోకి తీసుకోండి. తరవాతే ఉద్యోగ బాధ్యతల్నీ, ఇతర విషయాలనూ ఎంత వరకూ సమన్వయం చేసుకోగలరో అర్థమవుతుంది. ప్రతి పనికీ ప్లాన్‌ ‘బి’ ఉంటే దూసుకెళ్లొచ్చు.

గ్లాస్‌ సీలింగ్‌ దాటేయండి... కెరియర్‌ని ఎంచుకునేటప్పుడే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అది కచ్చితంగా, వాస్తవికంగా ఉండాలి. మీరు వేసే ప్రతి అడుగూ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇంటా, బయటా, ఉద్యోగంలోనూ మహిళ అనే వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఆత్మస్థైర్యం, చొరవ, పోరాట పటిమ, కష్టపడేతత్వం ఉంటే గుర్తింపు అదే వస్తుంది. పదోన్నతులూ వెంటపడతాయి. గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొట్టి ఉన్నతస్థానాలు అధిరోహించిన మహిళలు ఎందరో. వారి జీవితాల్ని, ఆ కథల్నీ తరచి చూడండి. స్ఫూర్తి రగులుతుంది.

అంగీకరించండి... కాలంతో పాటు మన చుట్టూ మార్పులు జరిగిపోతూ ఉంటాయి. వాటిని గమనించుకోవాలి. అంగీకరించాలి. అలాకాకుండా ఒకే కోణంలో ఆలోచిస్తూ... పరిస్థితులు మనకు తగ్గట్లు లేవని బాధపడటం ఎందుకు? పదే పదే పరాజయం పలకరించినా... మీ నాయకత్వ లక్షణాలను పక్కన పెట్టేయకండి. అదే మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్