మానేస్తే.. తప్పించుకోవచ్చు అనుకున్నా!

గాయాలైన ప్రతిసారి అనవసరంగా ఫాస్ట్‌ బౌలర్‌ని అయ్యా. మానేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చు.. అని ఎన్నిసార్లు అనుకొని ఉంటానో. అదంతా అప్పటికే.

Updated : 08 Jan 2023 10:41 IST

గాయాలైన ప్రతిసారి అనవసరంగా ఫాస్ట్‌ బౌలర్‌ని అయ్యా. మానేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చు.. అని ఎన్నిసార్లు అనుకొని ఉంటానో. అదంతా అప్పటికే. తిరిగి ఆటలో పడ్డానంటే దృష్టంతా వికెట్లు తీయడంపైనే! పశ్చిమ్‌ బంగాలోని చక్‌దా మాది. మధ్యతరగతి కుటుంబం. ఆటలంటేనే ఆలోచించే రోజులవి.. అలాంటిది ఏమాత్రం పరిచయం లేని మహిళా క్రికెట్‌ని కెరియర్‌గా ఎంచుకుంటానన్నా. ఇది చదివితే ఫలానా ఉద్యోగమొస్తుందని చెప్పొచ్చు. భవిష్యత్తే తెలియని దానిలోకి వెళితే ఎలాగని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ నా పట్టుదల చూసి సరేనన్నారు. అప్పటికి నాకు 15 ఏళ్లు. క్రికెట్‌ కోచింగ్‌కు వెళ్లాలంటే కోల్‌కతా వెళ్లాలి. వెళ్లి రావడానికే 3 గం. పైగా పడుతుంది. రోజూ వెళ్లొస్తోంటే ఎంతో అలసట. అయినా కొనసాగించా. అప్పుడు నా లక్ష్యం ఒక్కటే. భారత జట్టులో స్థానం సంపాదించాలి.. వికెట్‌ పడగొట్టాలి.. అమ్మానాన్నల్ని గర్వంగా తలెత్తుకునేలా చేయాలనే! ఈ లక్ష్యం ముందు ఇంకేమీ కనిపించేవి కాదు. ఆ పట్టుదలతోనే 19 ఏళ్లకే జట్టులో స్థానం సంపాదించా. కోరుకున్నట్టుగానే వికెట్‌ తీశా.. ఆ తర్వాత? రాణించాలన్న కోరిక మొదలైంది. ఒక్కోటి సాధిస్తున్న కొద్దీ మరొక లక్ష్యం వచ్చి చేరేది.. చివరగా ఆట నుంచి వైదొలగే నాటికి తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా నా ప్రదర్శన ఉండాలనుకున్నా. జీవితంలో మనల్ని నిరాశపరిచే.. వెనక్కిలాగే సంఘటనలు, సందర్భాలెన్నో ఎదురవుతాయి. వాటికి లొంగితే అక్కడే ఆగిపోతాం. అదే ఒక టార్గెట్‌ పెట్టుకొని పనిచేస్తూ వెళ్లండి. దాన్ని సాధించే క్రమంలో మిగతావన్నీ పక్కకెళ్లిపోతాయి. - జులన్‌ గోస్వామి, క్రికెటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్