నమ్మితేనే నాయకురాలవుతారు!

కొందరు ఉద్యోగినులు... బాధ్యతల్ని ఎంత సక్రమంగా నిర్వర్తించినా సరే, నలుగురిలోనూ ప్రెజంటేషన్లు ఇవ్వాలన్నా, సెమినార్లూ, మీటింగ్‌లకు నాయకత్వం వహించాలన్నా.. వెనకడుగు వేస్తారు.

Published : 22 Jan 2023 00:22 IST

కొందరు ఉద్యోగినులు... బాధ్యతల్ని ఎంత సక్రమంగా నిర్వర్తించినా సరే, నలుగురిలోనూ ప్రెజంటేషన్లు ఇవ్వాలన్నా, సెమినార్లూ, మీటింగ్‌లకు నాయకత్వం వహించాలన్నా.. వెనకడుగు వేస్తారు. దీనికి కారణం.. ప్రతిభ లేక కాదు... ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమే! ఈ తీరు మీ ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది అంటారు కెరియర్‌ నిపుణులు.

నమ్మండి: ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఇతరుల సంగతి పక్కనపెట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. అందరికీ అన్నీ తెలిసి ఉండాలని ఏమీ లేదు. కానీ, పనిపై పూర్తి అవగాహనతో చేస్తే... తడబాటుకి అవకాశం ఉండదు. ఆందోళన దరిచేరదు.

సానుకూలంగా: గెలుపోటముల్ని సమానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పనిలో విమర్శను సానుకూలంగా తీసుకోవాలి. ఎవరైనా విమర్శిస్తున్నారంటేనే.. మీరు వాళ్లు గుర్తించదగ్గ ఏదో ఒకపని చేస్తున్నారనే అర్థం. అయినా, అసలు ప్రతికూలంగా ఆలోచించడం ఎందుకు? మీ ఆలోచన అద్భుతం అనికూడా అందరూ ప్రశంసించే అవకాశమూ ఉంది కదా! మరి అసలు వెళ్లకుంటే ఏమవుతుంది? నలుగురిలో ఒకరిలా ఉండి పోతారు. మీ ఆలోచనలు బావుండొచ్చూ, లేకపోవచ్చు.. కానీ అవి చెప్పకుంటే ‘అసలు ఈ అమ్మాయికి ఏ ఆలోచనా లేదు’ అనే ముద్రపడుతుంది. అదే అసలైన ప్రమాదం!

వేర్వేరుగా చూడండి: మీరూ, మీ కెరియర్‌ వేర్వేరు అనే విషయం గుర్తుంచుకోండి. చదువు లేదా ఉద్యోగంలో మీ విజయాలూ, ఓటముల్ని మీ వ్యక్తిత్వం నుంచి వేరుగా చూడండి. వీటిలో పాతాళానికి పడిపోయినా సరే దాని ప్రభావం మీ వ్యక్తిత్వంపై పడకుండా చూడండి.  అప్పుడే ఎన్ని విమర్శలొచ్చినా వాటి మంచి చెడుల్ని తార్కికంగా ఆలోచించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్