నాయకురాలు అవ్వాలంటే...

ఏ రంగంలోనైనా రాణిస్తున్న మహిళల్ని చూసినప్పుడు స్ఫూర్తి పొందడం సహజమే! ‘నేనూ అలా సాధించాలి’ అనీ అనుకుంటుంటాం. మీరూ ఆ జాబితాలోని వారేనా? అయితే ఈ లక్షణాలను పెంపొందించుకోండి.. తిరుగులేని నాయకురాలవుతారు అంటున్నారు నిపుణులు.

Published : 04 Feb 2023 00:04 IST

ఏ రంగంలోనైనా రాణిస్తున్న మహిళల్ని చూసినప్పుడు స్ఫూర్తి పొందడం సహజమే! ‘నేనూ అలా సాధించాలి’ అనీ అనుకుంటుంటాం. మీరూ ఆ జాబితాలోని వారేనా? అయితే ఈ లక్షణాలను పెంపొందించుకోండి.. తిరుగులేని నాయకురాలవుతారు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దామా!

పంచుకోవాలి.. సాధారణంగా మహిళలకు ఎదుటివారిని కదిపి, మాట్లాడే స్వభావం ఎక్కువ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలరు కూడా. ఆఫీసు విషయానికి వచ్చేసరికే నోరు కట్టేసుకుంటారు. ‘ఎందుకులే, ఏమనుకుంటారో’ అని ఆగిపోతుంటారు. ఆ తీరే సరి కాదు. ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే మీ నైపుణ్యాలు, సామర్థ్యాలను ఇతరులు గుర్తించగలుగుతారు.

వ్యూహరచన... నాయకులవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. నూతన పద్ధతుల గురించి తెలుసుకోవాలి, అనుసరించాలి. లాభ, నష్టాలను బేరీజు వేయడమే కాదు.. వాటి గురించి ఇతరులతోనూ చర్చించాలి. తీసుకునే ప్రతి నిర్ణయం సంస్థ లక్ష్యాలు, తోటివారి సమర్థత ఆధారంగా సాగేలా చూసుకోవాలి.

బంధాలూ ముఖ్యమే... నాయకులుగా మారాలంటే తోటివారితో సత్సంబంధాలు నెరపడమూ ముఖ్యమే! బలమైన స్నేహితులుండాలి. నెట్‌వర్క్‌ పరిధినీ పెంచుకోవాలి. ఆఫీసన్నాక రాజకీయాలూ సాధారణమే. వాటిని తట్టుకోవడంలోనూ వీరు అండగా ఉంటారు. అలా కాకుండా ‘నేను, నా’ అనుకుంటూ సాగినా, స్వీయలాభం కోసమే చూసినా ముందుకు సాగలేరు. ‘మన’ అనుకొని బాధ్యత తీసుకోవాలి. కష్టానికి ముందుండాలి అప్పుడే ‘లీడర్‌’ అవ్వగలరు. తోటి మహిళలతో సానుకూల వాతావరణం ఏర్పరచుకోండి. వాళ్లకు తోడ్పాటునిస్తే.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మంచి నాయకురాలవ్వాలంటే ఈ మూడు నైపుణ్యాలు ఉన్నాయేమో చెక్‌ చేసుకోండి. అవసరమైతే నేర్చుకోండి. వీటితోపాటు నిర్ణయాలపై గట్టిగా నిలబడటం, రిస్క్‌ తీసుకోవడం, ముందుచూపు, తప్పు జరిగినప్పుడు ముందు నిలవడం వంటి లక్షణాలు నమ్మకమైన, ప్రామాణికమైన నాయకులుగా ఎదిగేలా చేస్తాయి. ఇలాంటివారినే సంస్థలూ ఎంచుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్