ఎన్ని.. మాటలనేస్తాం !

ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టా. మంచి నటిగా నిరూపించుకోవాలని కలలు కన్నా. తీరా ఇక్కడికొచ్చాక అదెంత కష్టమో అర్థమైంది. అవకాశాలు అందుకోవడమే కాదు.. వచ్చినవాటిని నిలబెట్టుకోవడమూ కష్టమే!

Published : 19 Feb 2023 00:17 IST

ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టా. మంచి నటిగా నిరూపించుకోవాలని కలలు కన్నా. తీరా ఇక్కడికొచ్చాక అదెంత కష్టమో అర్థమైంది. అవకాశాలు అందుకోవడమే కాదు.. వచ్చినవాటిని నిలబెట్టుకోవడమూ కష్టమే! ఒక్కోసారి విసుగు, కోపం తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఏం సాధించలేకపోతున్నానని నాపై నాకే కోపమొచ్చేది. దీనికితోడు ‘ఫలానా లోపముంది నీలో! దాన్ని మార్చుకో’ అంటూ వచ్చే సలహాలు. అవీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అదృష్టం.. నాపై నమ్మకం ఉన్నవాళ్లు నా చుట్టూ ఉన్నారు. ఏమాత్రం డీలాపడినా ప్రోత్సహించేవాళ్లు. మనవాళ్లకే మనపై అంత నమ్మకం ఉన్నప్పుడు మనపై మనకెంత ఉండాలి? నిజానికి మనతో ఎక్కువ సమయం గడిపేదీ మనమే. స్నేహితులు.. ఎవరో తెలియని వ్యక్తితో కూడా గట్టిగా మాట్లాడటానికి, కోప్పడటానికీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. మనతో మనం మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంటాం. ‘ఛ నా వల్ల ఏమీ కాదు, ఇంత లావైపోతున్నానేంటి?, ఇంకాస్త బాగా చేస్తే బాగుండేది కదా’ ఇలా ఎన్నిమాటలు అనేసుకుంటాం! దీంతో అనవసర ఒత్తిడి, ఆందోళన, అపనమ్మకం చేరతాయి. అందుకే అలా ఉండొద్దు. ఇతరులతో కాదు.. మీతో మీరు బాగుండండి. దయ చూపించుకోండి.. దేన్నైనా సాధించగలమనే సానుకూలత, ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతాయి. విజయాలూ అనుసరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్