ఆరోజు రావొద్దంటే!

పెద్ద సంస్థలు సైతం ఉద్యోగులను పక్కన పెట్టేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయంతో జీతాలు తగ్గించడం, పని రోజుల్లో కోత విధించడం చేస్తున్నాయి. లే ఆఫ్‌ భయం మీకూ ఉందా? అవి మీ వరకూ రావొద్దంటే కొన్నింటిపై దృష్టిపెట్టమంటున్నారు నిపుణులు.

Updated : 22 Feb 2023 04:36 IST

పెద్ద సంస్థలు సైతం ఉద్యోగులను పక్కన పెట్టేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయంతో జీతాలు తగ్గించడం, పని రోజుల్లో కోత విధించడం చేస్తున్నాయి. లే ఆఫ్‌ భయం మీకూ ఉందా? అవి మీ వరకూ రావొద్దంటే కొన్నింటిపై దృష్టిపెట్టమంటున్నారు నిపుణులు.

విలువ పెంచుకోండి.. వీళ్లు లేకపోయినా పని నడుస్తుంది.. అన్నప్పుడే సమస్య! మీ ప్రాధాన్యం పైవాళ్లకు తెలిసేలా చేయండి. అయితే కేవలం అబద్ధాలతో, మీ గొప్పలు చెప్పడం ద్వారా ఒప్పించలేరు. పని చేస్తూ దాన్ని వ్యక్తీకరించండి. తోటివారితో స్నేహంగా ఉండటం, వాళ్లు మీమీద ఆధారపడేలా చేయడం కూడా మీ విలువను పెంచేవే! సాధారణంగానే మనలో ఈ గుణం ఉంటుంది. అయితే కొందరితోనే స్నేహం చేస్తోంటే మాత్రం అది బయటపడదు. అందరికీ సాయపడాలి.

ఎక్కువ లాభం.. ఇలాంటి సమయంలో తక్కువ వనరులు, ఎక్కువ లాభం గురించే ఆలోచిస్తాయి సంస్థలు. దాన్ని సాధించగలవారికే ఓటేస్తాయి. కాబట్టి, సంస్థకు ప్రయోజనకరమైన వాటివైపే మీ ఆలోచనలు ఉండాలి. చేతల్లోనూ వాటిని చూపించాలి.

సమాధానం చెప్పగలిగితే.. ఉదాహరణకు- అకస్మాత్తుగా మీటింగ్‌ పెట్టారు. మీరు సాధించినవి లేదా ఈ నెలలో, వారంలో చేసినవి చెప్పండి అని అడిగారనుకోండి. ఏం చెబుతారు? రోజూ వచ్చి పనిచేశాం అని చెప్పినంతలో సరిపోదు కదా! సాక్ష్యం కనిపించాలి కూడా! సమయం గడిపి వెళ్లడానికీ, నాణ్యమైన పనితనం చూపడానికీ తేడా ఉంటుంది. దాన్ని చూపించినప్పుడే ‘మీరు ముఖ్యం’ అన్న భావన కలిగించగలుగుతారు. ఈ విషయంగా అవసరమైతే మిమ్మల్ని మీరు మలచుకోండి.

ఆ అవసరం ఉండొద్దు.. ‘ముల్లు గర్ర ఉంటేనే ఎద్దు ముందుకు’ అన్న చందాన ఉండొద్దు. పైవాళ్లు గమనిస్తున్నారు అన్నప్పుడు కష్టపడటం, ఎవరూ లేరనుకున్నప్పుడు పక్కవారితో మాటలు, ఫోన్‌లో గడిపేయడం వంటివి చేస్తున్నారో.. బాధ్యత లేదనే అనుకుంటారు. ఎవరో గమనింపుతో సంబంధం లేకుండా పని చేయండి. బాధ్యత తీసుకోండి. అలాంటివారిని సంస్థలు వదులుకోవు కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్