వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాల్సిందే!

నిత్యం ఎందరితోనో మాట్లాడుతుంటాం. కానీ, వారిలో ఒకరిద్దరే మనసుకు నచ్చుతారు. ఇందుకు బోలెడు కారణాలు. ఈ విషయం పక్కన పెడితే...అసలు మీరే ఓ మంచి స్నేహితురాలిగా ఉండాలంటే మాత్రం ఈ నియమాలను పాటించాలంటారు మనస్తత్వ నిపుణులు.

Published : 03 Mar 2023 00:08 IST

నిత్యం ఎందరితోనో మాట్లాడుతుంటాం. కానీ, వారిలో ఒకరిద్దరే మనసుకు నచ్చుతారు. ఇందుకు బోలెడు కారణాలు. ఈ విషయం పక్కన పెడితే...అసలు మీరే ఓ మంచి స్నేహితురాలిగా ఉండాలంటే మాత్రం ఈ నియమాలను పాటించాలంటారు మనస్తత్వ నిపుణులు.

* ఇద్దరి మధ్య స్నేహమైనా మరే బంధమైనా సరే! ఎక్కువకాలం నిలవాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. సరదాలు, సంతోషాలు, కష్టసుఖాలు... అన్నింటిలోనూ ఒకరికొకరుగా కలిసిపోవాలి. అప్పుడే మనసుకి దగ్గరవుతారు.

* స్నేహం చేస్తున్నాం కదా అని ఫ్రెండ్‌ని గుడ్డిగా నమ్మేయమని కాదు. వారి భావాలూ, ఆలోచనలూ, ప్రవర్తన వంటివీ గమనించండి. ఎక్కడైనా తేడా వస్తోంటే స్నేహితురాలిగా...హెచ్చరించండి. మీ ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉన్నా.. కొన్ని పనులు చేయడానికి పరిధిని పెట్టుకోవడం మరిచిపోవద్దు. లేదంటే మీకు తెలియకుండానే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.

* ఫ్రెండ్‌ ఏదైనా సమస్యలో ఉంటే.. గుడ్డిగా సమర్థించడం, లేదంటే నేను చెప్పినా వినలేదంటూ వాదనకు దిగడం వల్ల మీ స్నేహానికి విలువ ఉండదు. స్నేహితురాలు పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. తప్పు తనవైపు లేకపోయినా ఇబ్బందిపడుతోంటే.. కచ్చితంగా మీరు తోడుండాలి. వాస్తవాలనూ, వారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీపై వారికి మరింత నమ్మకం పెరుగుతుంది.

* స్నేహితుల మధ్య అపార్థాలకు అవకాశాలను ఇచ్చేది మాటల తూటాలే. మన స్నేహితురాలే అన్న నమ్మకమో లేక మేమేం మాట్లాడినా ఫరవాలేదన్న ధైర్యమో కానీ కొందరు స్నేహితులని చెబుతూనే వారిలోని లోపాలను పదే పదే ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తుంటారు. నిజంగా ఇతరుల నడవడికలో సమస్య ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నమే అయినా..  ప్రతిదానికీ హద్దులుంటాయని గుర్తించండి. లేదంటే నలుగురిలో వారు చిన్నబుచ్చుకుంటారు. ఎంత స్నేహితురాలే అయినా కొంత వ్యక్తిగత స్వేచ్ఛ అవసరమమే కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్