ఆ సెలవు వెనుక...

మన ఆడవాళ్ల జీవితంలో సగటున 3,000 రోజులు నెలసరితో గడుపుతాం. అంటే ఎనిమిదేళ్లకు పైగా అన్నమాట. ఆ రోజులు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటాయి.

Published : 05 Mar 2023 00:07 IST

న ఆడవాళ్ల జీవితంలో సగటున 3,000 రోజులు నెలసరితో గడుపుతాం. అంటే ఎనిమిదేళ్లకు పైగా అన్నమాట. ఆ రోజులు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటాయి. కొందరైతే దుర్భర కడుపునొప్పి, ఓవర్‌ బ్లీడింగ్‌, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారాలతో బాధపడుతుంటారు. ఇంకొందరు పొత్తికడుపులో పోట్లతో ప్రసవవేదనను తలపించేంత యాతన అంటూ వాపోతుంటారు. ఈ పెయిన్‌ఫుల్‌ పీరియడ్స్‌ కారణంగానే నెలసరి సెలవు మంజూరు చేయాలంటూ గళం విప్పారు.  ఇదెంతో అవసరమని ఉద్యోగినులు వాదిస్తోంటే.. కొన్ని కంపెనీలు మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో దీని పరిణామాలూ పర్యవసానాలేంటో చూద్దాం..

* మెన్‌స్ట్రువల్‌ లీవ్‌ చాలా మంచి ఆలోచన. నెలసరిలో యాతన అనుభవించేవారికి ఈ సెలవు ఎంతగానో తోడ్పడుతుంది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుని ఆరోగ్యంగా ఉండటమే కాదు, మరింత శక్తి పుంజుకుని హుషారుగా పనిచేస్తారు’ అంటున్నారు కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జెస్సికా బర్నాక్‌. ఆమె రుతుస్రావానికి సంబంధించిన అంశాలపై ఏళ్ల తరబడి పరిశోధన చేశారు.

* 20 శాతం స్త్రీలు నెలసరిలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. 80 శాతం మంది 50 ఏళ్లు వచ్చేలోపు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌తో అవస్థపడుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఆ రోజుల్లో సెలవు ఇచ్చేందుకు సంస్థలకు అభ్యంతరం లేదు కానీ అది పెయిడ్‌ లీవ్‌ అంటేనే వివాదాస్పదమౌతోంది. ముఖ్యంగా అత్యధిక జీతాలు చెల్లించే కార్పొరేట్‌ సంస్థలు గంటకు ఇంతని లెక్కకట్టి అది తమకెంత నష్టదాయకమో వివరిస్తున్నాయి.

* దక్షిణ కొరియా, ఇండోనేషియా, జాంబియా లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే నెలసరి సెలవలను ఆమోదించి అమలుపరిచాయి. దేశంలోనూ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో సహా ఎన్నో సంస్థలు తన ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించింది.

* ‘నెలసరి సెలవు అమలైతే స్త్రీల సామర్థ్యాన్ని కించపరచడం, వ్యతిరేకత చూపడం, వివక్ష ఎక్కువవడం లాంటివే కాదు.. అనేక సంస్థలు ఉద్యోగం ఇవ్వడానికే నిరాకరించే ప్రమాదముంది’ అంటున్నారు విశ్లేషకులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్