భయమేస్తే... సేఫ్టీపిన్‌

రోజా ఉండేది నగరు శివారులో. ఆఫీస్‌ అయ్యేది 9 గం.లకి... ఇంటికి చేరుకునే సరికి 11 అవుతుంది. బస్‌ దిగాక 2 కిలోమీటర్లు నడవాలి... ఆ సమయంలో భయంతో బిక్కుబిక్కుమంటూ రోజూ ఇబ్బందులు పడుతూనే ఉంది...

Published : 07 Mar 2023 00:01 IST

రోజా ఉండేది నగరు శివారులో. ఆఫీస్‌ అయ్యేది 9 గం.లకి... ఇంటికి చేరుకునే సరికి 11 అవుతుంది. బస్‌ దిగాక 2 కిలోమీటర్లు నడవాలి... ఆ సమయంలో భయంతో బిక్కుబిక్కుమంటూ రోజూ ఇబ్బందులు పడుతూనే ఉంది...

రాణి ఇంజినీరింగ్‌ చదువుతుంది. పరీక్షలు కారణంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల అయ్యే సరికి రాత్రి 9 అవుతోంది. బస్‌ ప్రయాణం అంటే భయం.

దో ఒక సందర్భంలో మనలో చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఉంటారు. వాటన్నిటికి పరిష్కారంగా చెబుతూ వచ్చిందే  ‘‘మై సేఫ్టీపిన్‌’’ మొబైల్‌ అప్లికేషన్‌. ప్లేస్టోర్‌ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక లోకేషన్‌ వివరాలు అడుగుతుంది. పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి. సంబంధిత ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగ్‌ఇన్‌ అయిపోవచ్చు. రాత్రుళ్లు ఒంటరిగా నడిచినప్పుడు భయమేస్తే ఈ అప్లికేషన్‌ అన్‌చేస్తే సరి. దీని ద్వారా మనం ఎక్కడున్నది ట్రాక్‌ అవుతూ ఉంటుంది. అప్లికేషన్‌ లాగ్‌ఇన్‌ అయ్యేటప్పుడు సమయానికి అందుబాటులోకి వచ్చి, మనల్ని రక్షించగలిగే ఐదుగురు వ్యక్తుల ఫోన్‌ నెంబర్లను నిక్షిప్తం చేయాలి.

ఉపయోగాలు...

1. ప్రయాణాల్లో మనకి రక్షణ లేదు అనిపించినప్పుడు... ఈ అప్లికేషన్‌ ఆన్‌ చేస్తే మనల్ని రక్షించే వారికి సందేశం చేరుతుంది. దీని కోసం ఫైండ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది.

2. క్యాబ్‌లు, బస్‌లు ఎక్కినప్పుడు మన లోకేషన్‌ను తెలిసిన వారికి షేర్‌ చేస్తే... వాళ్లు సులువుగా మనల్ని ట్రాక్‌ చేసేయవచ్చు.

3. ఏవైనా ప్రాంతాలను సందర్శించేటప్పుడు అక్కడ పరిస్థితులను దీనిలో ఉంచవచ్చు. ఎలా అంటే... లైట్లు ఉన్నది లేనిదీ... ప్రయాణ మాధ్యమాలు ఏవి అందుబాటులో ఉంటాయి. పోలీస్‌ స్టేషన్‌, ఆసుపత్రి ఎంత దూరంలో ఉంది. వంటి వివరాలను పొందుపరచడం వల్ల మనతో పాటు... తరువాత ఆ స్థలాన్ని సందర్శించే వారికీ ఇది ఉపయోగపడుతుంది.

ఈ రోజుల్లో స్మార్ట్‌పోన్లు లేని వారులేరు. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లకు ఈ అప్లికేషన్‌ బాగా ఉపయోగపడుతుంది కదూ.. డౌన్‌లోడ్‌ చేసేద్దామా మరి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్