మీకు కష్టం రాకుండా...!

కష్టసుఖాల్లో తోడుంటానన్న భర్తే కన్నీళ్లు పెట్టించొచ్చు. ప్రేమించిన వాడే వేధించొచ్చు. అయిన వాళ్లే నిలువ నీడలేకుండా చేయొచ్చు. కానీ ఈ చట్టాలు మాత్రం మీకు అన్ని వేళలా తోడుంటాయి.

Updated : 08 Mar 2023 03:25 IST

కష్టసుఖాల్లో తోడుంటానన్న భర్తే కన్నీళ్లు పెట్టించొచ్చు. ప్రేమించిన వాడే వేధించొచ్చు. అయిన వాళ్లే నిలువ నీడలేకుండా చేయొచ్చు. కానీ ఈ చట్టాలు మాత్రం మీకు అన్ని వేళలా తోడుంటాయి. మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటాయి. అవేంటో తెలుసుకోండి..

1 ఇంటి వేధింపుల నుంచి: ఇళ్లల్లో మహిళలపై వివిధ రూపాల్లో జరిగే హింస నుంచి రక్షణ కల్పిస్తుంది గృహహింస నిరోధక చట్టం- 2005. మౌనంగా ఉండిపోకుండా ధైర్యంగా ముందుకొచ్చి కష్టం చెప్పుకొంటే అండగా నిలుస్తుంది.

2 పనిచేసే చోట ఇబ్బందా?: లైంగిక వేధింపుల చట్టం-2013. ఇది ప్రభుత్వ, ప్రైవేట్‌, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు మాత్రమే కాకుండా చిన్న చిన్న దుకాణాలూ, ఇళ్లూ వంటిచోట్ల పనిచేసే మహిళలకూ భద్రత కల్పిస్తుంది. వారి హక్కులను కాపాడుతుంది.

3 యాసిడ్‌ దాడి చేస్తే: నేరసంబంధ న్యాయ సవరణ చట్టం- 2013.. యాసిడ్‌ దాడులూ, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి నేరాలకు తీవ్రమైన శిక్షలు పడేలా చేస్తుంది.

4 వివాహిత ఆస్తి చట్టం: పెళ్లైన మహిళ స్వార్జితపు ఆస్తిని దాన, విక్రయ వీలునామాలనూ స్వతంత్రంగా, స్వేచ్ఛగా చేయడానికి సహకరించే చట్టం ఇది.

5 స్త్రీలకు ఆస్తిహక్కు: హిందూ వారసత్వ చట్టం సెక్షన్‌ 14(1) ప్రకారం స్త్రీలకు వారసత్వ హక్కు ఉంది. ఏపీలో 1986లో సవరణ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురుకి కూడా హక్కులున్నాయని చెబుతోంది.

జి. వరలక్ష్మి, న్యాయవాది

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్