ఇక్కడకు మగవాళ్లు రాకూడదు!

మన దేశంలో కొన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించరు. అయితే దీనికి పూర్తి భిన్నంగా కొన్ని దేవాలయాలున్నాయి. ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది...

Published : 08 Mar 2023 00:35 IST

మన దేశంలో కొన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించరు. అయితే దీనికి పూర్తి భిన్నంగా కొన్ని దేవాలయాలున్నాయి. ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది...

కుమారీ అమ్మన్‌ గుడి

ఈ ఆలయం కన్యాకుమారిలో ఉంది. పెళ్లైన మగవాళ్లకి ఈ గుడి ప్రాంగణంలోకి కూడా ప్రవేశం లేదు. పరమశివుడిని భర్తగా పొందాలని పార్వతీ దేవి ఇక్కడ తపస్సు చేసిందని చెబుతారు. మహిళలు, ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు ఈ గుడిని ఎక్కువగా దర్శించుకుంటారు.

మాతా టెంపుల్‌

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఉందీ ఆలయం. మహిళలు నెలసరి సమయంలో మాత్రమే అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో పూజారులు సైతం అక్కడికి రావడం నిషేధం.

అట్టుకల్‌ భగవతీ ఆలయం

కేరళలో ఉందీ ఆలయం. ఏటా జరిగే ‘పొంగల్‌’ పండగలో లక్షల మంది మహిళలు పాల్గొంటారు. ఇదో రికార్డుగా గిన్నిస్‌ బుక్‌లో నమోదు కావడం విశేషం. పది రోజులు జరిగే ఈ పండగ ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తుంది. ఇక్కడి అమ్మవారికి మహిళలు గాజులను కానుకగా సమర్పిస్తారు.

బ్రహ్మదేవుడి గుడి

రాజస్థాన్‌లో నిర్మించిన ఈ ఆలయానికి పురుషులకు ప్రవేశం లేదు. పురాణాల ప్రకారం.. సమీప నదీ తీరాన బ్రహ్మ, సరస్వతి యజ్ఞం చేయాలనుకుంటారు. ఆమె ఆలస్యంగా రావడంతో బ్రహ్మదేవుడు గాయత్రీ దేవిని వివాహం చేసుకుని పూజ ముగిస్తాడు. కోపం వచ్చిన సరస్వతిదేవి ‘గుడిలోకి ప్రవేశించిన మగవారికి వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి’ అని శాపమిచ్చిందట.

కామాఖ్య ఆలయం..

గువాహటిలోని కామాఖ్య ఆలయం మాదిరిగానే కామాఖ్య పీఠం విశాఖలో ఉంది. ఇక్కడ పురుషులను నెలలో కొన్ని రోజులు గుడిలోకి అనుమతించరు. మహిళలు నెలసరి సమయంలో ఈ దేవతను దర్శించుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్