ఈ సంఖ్య పెరుగుతోంది..

ఇప్పుడంటే అమ్మాయిలు పురుషాధిపత్య రంగాల్లో పాగా వేస్తున్నారు. కానీ, ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్తే నాటి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండేది.

Published : 12 Mar 2023 00:11 IST

ఇప్పుడంటే అమ్మాయిలు పురుషాధిపత్య రంగాల్లో పాగా వేస్తున్నారు. కానీ, ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్తే నాటి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండేది. పాత్రికేయ రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. కానీ, ఆ సమయంలోనే మహిళా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే తపన మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన లక్ష్మీశర్మను జర్నలిజం వైపు నడిపించింది. దేశంలోనే దళిత మహిళలు నడుపుతున్న ఏకైక మహిళా దినపత్రిక ‘ఖబర్‌ లెహరియా’లో జర్నలిస్టుగా ఎంతోమంది గ్రామీణ మహిళల జీవితాల్లోని దయనీయ పరిస్థితుల్ని వెలుగులోకి తెచ్చారామె. ఆ పత్రిక సహవ్యవస్థాపకురాలైన షాలినీజోషి కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. రెండు దశాబ్దాల క్రితం ఇలా ఈ రంగంలోకి అడుగుపెట్టిన మహిళల సంఖ్య రెండంకెలలోపే ఉండేది. కానీ, ఇప్పుడు ప్రపంచప్రఖ్యాత మీడియా సంస్థలైన వాషింగ్టన్‌ పోస్ట్‌, బీబీసీ న్యూస్‌, కరెంట్‌ అఫైర్స్‌ వంటి వాటిల్లోనూ నాయకత్వ బాధ్యతల్లో స్త్రీలే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 ప్రముఖ మీడియా సంస్థల్లో 23 శాతం మంది మహిళలు ఉన్నతస్థాయి ఎడిటర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ సంఖ్య ఆయా ప్రాంతాల్లో మారుతూ ఉంది. దక్షిణాఫ్రికాలో 47 శాతంమంది టాప్‌ పొజిషన్‌లో ఉండగా...జపాన్‌లో అసలు ఉన్నతస్థాయిలో మహిళా ఎడిటర్‌లే లేరు. జర్మనీ, దక్షిణకొరియాలో ఈ శాతం చాలా తక్కువ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్