ఇలా చేస్తే సమయం ఆదా

ప్రాజెక్టు డెడ్‌లైన్లు, ప్రజెంటేషన్‌ ఒత్తిడి ఇలాంటి వాటితో నిత్యం సతమతమవుతాం. వీటిన్నంటి మధ్య ఇంటికొచ్చాక వంట గురించి ఆలోచించేందుకు ఓపిక ఉండదు. ఇంత తీరిక లేకుండా ఉన్నా కొన్ని చిట్కాలు పాటించి ఇంటినీ, ఆఫీసుని చక్కగా మేనేజ్‌ చేయొచ్చంటున్నారు నిపుణులు..

Published : 16 Mar 2023 00:26 IST

ప్రాజెక్టు డెడ్‌లైన్లు, ప్రజెంటేషన్‌ ఒత్తిడి ఇలాంటి వాటితో నిత్యం సతమతమవుతాం. వీటిన్నంటి మధ్య ఇంటికొచ్చాక వంట గురించి ఆలోచించేందుకు ఓపిక ఉండదు. ఇంత తీరిక లేకుండా ఉన్నా కొన్ని చిట్కాలు పాటించి ఇంటినీ, ఆఫీసుని చక్కగా మేనేజ్‌ చేయొచ్చంటున్నారు నిపుణులు..

వారంలో ఏం వండాలనుకుంటున్నారో దానికి తగ్గట్లు సామగ్రినంతా ఒకేసారి కొనుగోలు చెయ్యాలి. ఇలా ప్రణాళిక వేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది.

ఎక్కువగా.. ఇడ్లీ, దోసె లాంటి వాటికి వారానికి సరిపడా పిండి సిద్ధం చేసి పెట్టుకుంటే సరి. అలా అయితే ఉదయాన్నే కంగారు లేకుండా టిఫిన్‌ చేయొచ్చు. సాయంత్రం వేళ పిల్లలు ఆకలి వేస్తుందన్నా తేలికగా స్నాక్స్‌ చేసి పెట్టొచ్చు.

స్టాక్‌ ఉండేలా.. నూడుల్స్‌, మసాలా ఓట్స్‌, పోహా వంటి వాటిని డబ్బాల్లో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉంచే కార్న్‌ఫ్లేక్స్‌, పండ్ల సలాడ్‌లు, డ్రైఫ్రూట్‌ షేక్‌లవంటివాటిని ఉదయం అల్పాహారంగా ఎంచుకుంటే పని తేలిక అవుతుంది.

టెక్నాలజీతో..  కొత్త సాంకేతికతతో ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయి. వాటిని ఉపయోగించి తొందరగా పని ముగించేయొచ్చు. చాకుతో కూరగాయలు తరిగితే కొంత ఆలస్యమవచ్చు.  బదులుగా చాపర్‌ని వాడితే పని సులువవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్