Published : 28/03/2023 00:14 IST

డైరీతో చెబుదాం..

పనిభారం, భాగస్వామితో వివాదం, ఆఫీసుపని ఆందోళన ఇలాంటివన్నీ మనలోనే దాచుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఎవరితోనైనా పంచుకుంటే బాగుంటుందనిపించినప్పుడు ... మన సమస్యలను పక్కవారి మీద రుద్దడం ఎందుకని ఆగిపోతాం. కానీ దానికో పరిష్కారం ఉంది. అదే పర్సనల్‌ డైరీ..

ఎవరితోనైనా వివాదం వచ్చినప్పుడు దానికి సంబంధించిన కోపం, బాధ మనసులోనే ఉంటాయి. దాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక ఒంటరిగా అనిపించినప్పుడు డైరీలో రాయండి. ఇలా చేయటం వల్ల గుండెల్లో భారం దిగిపోయి మనసు తేలిక పడుతుంది.

భవిష్యత్తులో చేయాలనుకున్న పనులు, లక్ష్యాలు, సంతోషాలు అన్నీ డైరీతో పంచుకున్నప్పుడు మనకంటూ ప్రత్యేకంగా ఒక నేస్తం ఉన్నట్టే అనిపిస్తుంది.

ప్రతి విషయాన్నీ డైరీలో రాసుకోవటం వల్ల మనం చేసే తప్పొప్పులపై అవగాహనా వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని