మీ అభిరుచి ఏంటి?

చిన్నతనంలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యాపకాలుంటాయి. పెద్దయ్యాకే కుటుంబం, ఆఫీసు, ఇంటిపని అంటూ ఉరుకులు పరుగులు.

Published : 03 Apr 2023 00:29 IST

చిన్నతనంలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వ్యాపకాలుంటాయి. పెద్దయ్యాకే కుటుంబం, ఆఫీసు, ఇంటిపని అంటూ ఉరుకులు పరుగులు. భర్త పిల్లలంటూ మన గురించిన ఆలోచనే మర్చిపోతాం. అదే వద్దంటున్నారు నిపుణులు..

* పాటలు పాడటం, కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం, మొక్కలను పెంచడం లాంటి అభిరుచి ఉంటే మంచిదే. ఒక్కోసారి ఏం తోచకపోతే సరదాగా మీకు నచ్చిన వ్యాపకంతో సమయాన్ని గడపండి. దీని వల్ల ఒత్తిడి తగ్గి మనసుకు సంతోషంగా అనిపిస్తుంది.

* హాబీలు చిన్నప్పటి సరదాలని గుర్తుచేస్తాయి. అంతేకాకుండా మనపై మనకు నమ్మకం కలిగిస్తాయి. వాటి గురించి లోతుగా తెలుసుకోవాలనే క్రమంలో ఎక్కువ మందితో చర్చిస్తాం. దీంతో సమాచార నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి.

* ఈ వ్యాపకాలే కొన్నిసార్లు ఎంతోమంది గృహిణులను వ్యాపారవేత్తలను చేశాయి. మీలో ప్రతిభకీ సానపెట్టండి. అది నలుగురికి ఉపాధి కలిగిస్తే మనసుకీ తృప్తిగా ఉంటుంది.

* నచ్చిన పని చేయటం వల్ల ఉత్సాహంగా ఉండొచ్చు. రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. ఒంటరితనాన్ని కూడా దూరం చేస్తుంది. అంతేకాదు ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ దరిచేరవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్