అప్పుడే.. ఎదగగలం

ఎంచుకున్న వృత్తిలో ఉన్నతంగా ఎదగాలంటే వృత్తికి సంబంధించిన నైపుణ్యాలతో పాటు కొన్ని లక్షణాలు అలవరచుకోవాలంటున్నారు నిపుణులు అవేమిటో చూద్దామా!

Published : 08 Apr 2023 00:18 IST

ఎంచుకున్న వృత్తిలో ఉన్నతంగా ఎదగాలంటే వృత్తికి సంబంధించిన నైపుణ్యాలతో పాటు కొన్ని లక్షణాలు అలవరచుకోవాలంటున్నారు నిపుణులు అవేమిటో చూద్దామా!

రాజీపడనితత్వం.. మన కలలు, లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. అనుకున్నది సాధించేంత వరకూ పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకవేళ అలా జరగకపోతే తర్వాత ఏం చేయాలన్న దానిపై ప్లాన్‌ బి కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రణాళిక వేసుకునేటప్పుడే దీన్నీ ఆలోచించుకోవాలి.

రిస్క్‌ తీసుకోవాలి.. మన అంతిమ లక్ష్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటమే. ఒకేసారి ఎదగాలని ఎప్పుడూ అనుకోవద్దు. డబ్బు సంపాదించటమే ప్రధాన ధ్యేయం కాకుండా ఉద్యోగంలో ఎదుగుదల మీద దృష్టి సారించాలి. అలానే సవాళ్లు ఎదుర్కోవడంలో, కొత్తవి ప్రయత్నించడంలోనూ ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ఈ ప్రయత్నంలో అపజయాలు ఎదురైనప్పటికీ అది నేర్చుకోవడంలో భాగం అనుకోవాలి. గతంలో ఎదురైన అపజయాల్ని తలుచుకుని భవిష్యత్తులో రిస్క్‌ తీసుకోడానికి భయపడకూడదు. అలా చేస్తే ఉన్నచోటేే ఆగిపోవాల్సి వస్తుంది.

మార్పును ఆహ్వానిస్తేనే.. వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో మార్పు సహజం. ఏ విషయం లోనైనా మార్పు అవసరమైతే దాన్ని సాదరంగా ఆహ్వానించండి. ఉద్యోగం, ప్రాజెక్టు ఇలా ఏదైనా సరే పూర్తి శ్రద్ధతో కష్టపడి పనిచేస్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది. జట్టులో అందరితో కలిసి పనిచేసినా, కొంతవరకు మాత్రమే వాళ్లపై ఆధారపడండి. అంతేకానీ గుడ్డిగా ఎదుటి వాళ్లను నమ్మొద్దు. చొరవతో మనమే పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి. అప్పుడు వృత్తి జీవితంలో ఉన్నతంగా ఎదగగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్