పని ఒత్తిడా.. చిత్తు చేసేద్దాం!

మహిళలు ఇంటా, బయటా కొన్నిసార్లు మల్టీటాస్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా... విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పనిచేస్తే ఒత్తిడి బారిన పడే ప్రమాదం ఉందంటారు నిపుణులు...

Published : 14 Apr 2023 00:06 IST

మహిళలు ఇంటా, బయటా కొన్నిసార్లు మల్టీటాస్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా... విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పనిచేస్తే ఒత్తిడి బారిన పడే ప్రమాదం ఉందంటారు నిపుణులు...

* ఆసక్తి తగ్గిందా... చేసే పని ఏదైనా ఇష్టంగా చేస్తే పెద్ద కష్టంగా అనిపించదు. అయితే, ఒకే తరహా పని పదే పదే చేయాల్సి వచ్చినప్పుడో, అందులో కొత్తదనం లోపించినప్పుడో మాత్రం విసుగ్గా ఉంటుంది. తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే అందులో నాణ్యతా దెబ్బతింటుంది. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే దాన్ని కొనసాగించకండి. కొంత విరామం తీసుకోండి లేదా మీ దృష్టిని వేరే వ్యాపకం మీదకు మళ్లించండి. ఒత్తిడి దరిచేరదు. పనిని పునఃప్రారంభించాల్సి వచ్చినప్పుడు మునుపటి ఉత్సాహంతో అడుగులేయగలరు.

* ప్రణాళికా ముఖ్యమే.. ఇంటా, బయటా పనుల ఒత్తిడి పెరిగిపోయిందా? ఏవీ సకాలంలో పూర్తికావడం లేదా? అయినా సరే హైరానా పడిపోవద్దు. కాస్త నిదానంగా ఆలోచించండి. ముందు చేయాల్సిన పనులన్నీ ప్రాధాన్యతా క్రమంలో విభజించుకోండి. దేనికి ఎంత సమయం పడుతుందో అవగాహన తెచ్చుకోండి. అప్పుడు కష్టంగా ఉన్నవాటిని ముందూ, సులువైన వాటిని తర్వాతా చేస్తే మీ శ్రమ వృథాకాదు. అలసటా ఎదురుకాదు.  ప్రణాళికతో చేస్తే సులువుగా ఎలాంటి పనులైనా పూర్తయిపోతాయి.

* నేర్చుకోండి- నేర్పించండి: అన్ని విషయాలూ అందరికీ తెలిసి ఉండాలనేం లేదు. నాకే అన్నీ తెలుసు. నేనైతేనే కరెక్ట్‌గా చేయగలను అని మీకు మీరు అనుకోవడం, ప్రతి పనినీ నెత్తిన వేసుకోవడం వల్ల అధికభారం, ఒత్తిడితప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా ఇలా చేసే పనుల్లో కొన్నిసార్లు కొత్తదనమూ లోపించొచ్చు. అందుకే, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వండి. మీకంటే చిన్నవారు చెప్పినా తెలుసుకొని ప్రయోగాలూ చేయండి. అప్పుడు ఒత్తిడిని దాటి ఉత్సాహంగా ఉండగలరు. అలానే, ఇతరులకూ బాధ్యతల్ని అప్పగించి వారికీ పని నేర్పించగలిగితే సరి. స్ట్రెస్‌ ఉండదు. జీవితం సానుకూలంగా సాగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్