అప్పుడు.. అభిరుచి సాయం!

ఇల్లు, పిల్లలు, ఆఫీస్‌ అంటూ రోజంతా తీరిక లేకుండా గడిపేసే జీవనశైలి ఇప్పటి మహిళలది. విశాంత్రి దొరక్క, సరైన ఆహారం తీసుకోక ఒత్తిడి వీరిని చిత్తు చేసేస్తోంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని అభిరుచులు అలవాటు చేసుకోవాలంటారు నిపుణులు.

Published : 20 Apr 2023 00:47 IST

ఇల్లు, పిల్లలు, ఆఫీస్‌ అంటూ రోజంతా తీరిక లేకుండా గడిపేసే జీవనశైలి ఇప్పటి మహిళలది. విశాంత్రి దొరక్క, సరైన ఆహారం తీసుకోక ఒత్తిడి వీరిని చిత్తు చేసేస్తోంది. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని అభిరుచులు అలవాటు చేసుకోవాలంటారు నిపుణులు.

* చిన్నప్పుడెప్పుడో సరదాగా పాటలు నేర్చుకోవాలనిపించి ఉండొచ్చు. తోచనప్పుడు బొమ్మలు వేయడం, మనసులోని భావాలకు అక్షరరూపం ఇవ్వడం వంటివీ చేసి ఉండొచ్చు. వాటికి అప్పుడు స్థానం ఇవ్వకపోయినా...ఇప్పుడు కాస్త సమయం కేటాయించుకోండి. సంబంధిత తరగతుల్లో చేరండి. శిక్షణ తీసుకోండి. ఎందుకంటే, మనసుకు నచ్చింది చేసినప్పుడు దొరికే సంతృప్తి మరెక్కడా దొరకదు. దీనికి వయసుతో పనిలేదు. ఓ సారి ప్రయత్నించి చూడండి.

* ఏ పనిచేసినా ఒంటరితనం వెంటాడుతుంటే... మరింత ఒత్తిడికి గురవుతుంటాం. దాంతో దేని మీదా ఆసక్తి ఉండదు. ఏ పనీ చేయాలనిపించదు. ఇలాంటప్పుడు మనకిష్టమైన వ్యాపకాన్ని రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకుంటే మేలు. ఇతర పనుల్లానే దానికీ సమయం కేటాయించుకోవడం వల్ల ఒత్తిడి కలిగించే అంశాల నుంచి దృష్టిని త్వరగా మళ్లించుకోగలం. ఉత్సాహంగానూ ఉండగలం.

* మీకిష్టమైన ఎన్నో అంశాలపై ఆలోచనలు ఉండి ఉంటాయి. మరెన్నో విషయాలను పంచుకోవాలన్న ఆసక్తీ ఉంటుంది. అందుకు ఆన్‌లైన్‌లో ఎన్నో వేదికలు అవకాశం కల్పిస్తున్నాయి. మీరు రాసిన కవితలూ, గీసిన బొమ్మలూ, మీ హస్తకళా రూపాలు వంటివన్నీ అక్కడ ప్రదర్శించొచ్చు. ఇది మీ పరిధిని విస్తృత పరచి.... కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. అవసరమైతే కొత్త కెరియర్‌ మార్గాన్నీ చూపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్