అంకితభావం ముఖ్యం

ఉద్యోగం అన్నాక ఒక్కోసారి పనిభారం ఎక్కువవుతుంది. మరేవో సమస్యలూ ఎదురౌతాయి. అంతమాత్రాన కుంగిపోక సవాలుగా తీసుకుని ముందుకు సాగాలి.

Updated : 20 May 2023 05:24 IST

ఉద్యోగం అన్నాక ఒక్కోసారి పనిభారం ఎక్కువవుతుంది. మరేవో సమస్యలూ ఎదురౌతాయి. అంతమాత్రాన కుంగిపోక సవాలుగా తీసుకుని ముందుకు సాగాలి. ఇంకా ధ్యాస పెట్టి, మరింత చాకచక్యంగా పనిచేస్తే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్నత స్థాయికి వెళ్లొచ్చు. అప్పుడు ఆర్థిక వెసులుబాటే కాదు, మాటలకందని సంతృప్తీ సొంతమవుతుంది. అందుకోసం నిపుణుల సూచనలివి..

* మన ఆలోచనా వైఖరే ఆచరణగా మారుతుంది. అయితే మన చర్యలు ఆమోద యోగ్యంగానే ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ధరించుకోవాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే మార్చుకోవడం మంచిది. బాగున్నాయి అనుకున్నప్పుడు.. ఆరంభ శూరత్వంలా కొన్ని రోజులు పాటించి, ఆనక మానేయకుండా వాటిని అలవాటుగా మార్చుకోవాలి. ఈ క్రమంలో మనలో పరిపక్వత పెరుగుతుంది, నైపుణ్యాలు మెరుగవుతాయి. ఇదే ఏ రంగంలోనైనా ఎదుగుదలకు అసలు సిసలైన సూత్రం.

* చాలామంది తమ పని వరకూ సమర్థంగా పూర్తిచేస్తారు. కానీ సహోద్యోగులతో కలిసి చేయాల్సినప్పుడు కొంచెం వెనకబడటమో, వంకలు పెట్టించుకోవడమో జరుగుతుంటుంది. అలాంటప్పుడు కోపతాపాలు ప్రదర్శించుకునే బదులు టీమ్‌ వర్క్‌ ప్రాధాన్యతను గుర్తించాలి. సాధారణంగా ఒంటరిగా నడుస్తున్నప్పుడు నడక వేగంగా సాగే మాట నిజం. కానీ ఇతరులతో కలిసి వెళ్తుంటే అడ్డంకులను తేలిగ్గా పరిష్కరించుకోవడానికి, పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. కనుక టీమ్‌లో ఎవరితోనైనా చిన్న చిన్న పేచీలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ అందరితో కలసి నడవడం, మనతోపాటు నడిపించడం ఉత్తమం అని గుర్తుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్