వారాంతాల్లో ఏం చేస్తున్నారు?

వారమంతా ఆఫీసు పనిలో బిజీగా ఉంటాం. మరి వారాంతాల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు.. దాన్ని బట్టే మనం మిగిలిన రోజుల్లో చురుగ్గా పనిచేయగలం... అందుకు నిపుణులేమంటున్నారంటే.. నిద్రతో.. సమయం దొరికింది కదా అని ఫోన్లకు అతుక్కుపోవద్దు. నిద్రకు ప్రాధాన్యమివ్వండి.

Published : 23 May 2023 00:37 IST

వారమంతా ఆఫీసు పనిలో బిజీగా ఉంటాం. మరి వారాంతాల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు.. దాన్ని బట్టే మనం మిగిలిన రోజుల్లో చురుగ్గా పనిచేయగలం... అందుకు నిపుణులేమంటున్నారంటే..

నిద్రతో.. సమయం దొరికింది కదా అని ఫోన్లకు అతుక్కుపోవద్దు. నిద్రకు ప్రాధాన్యమివ్వండి. అప్పుడే వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. పడుకునే ముందు ఏదైనా పుస్తకం చదవండి. దానివల్ల కాసేపు బయట ప్రపంచాన్ని మర్చిపోయి సాంత్వన కలుగుతుంది.

వ్యాయామం.. రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. దానివల్ల జ్ఞాపకశక్తి పెరగటమే కాదు ఆందోళన కూడా తగ్గుతుంది. అలానే ఒత్తిడి తగ్గించే చాక్లెట్లు, గుడ్లు, పాలకూర, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోండి.

మిత్రులతో.. స్నేహితులు, కుటుంబసభ్యులతో సమయం గడపండి. అలా కాసేపు బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. దానివల్ల ఒత్తిడి తగ్గి, ఉత్సాహంగా ఉంటాం. కాసేపు మీకిష్టమైన వ్యాపకానికి పదునుపెట్టండి. అది మానసికంగా, శారీరకంగా మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్