ఉద్యోగంలో చేరాక...

ఉద్యోగాల్లో కుదురుకునే వరకూ... సరదాగా గడిపేసే యువత ఆ తర్వాత పని ఒత్తిడి అంటూ సతమతమవుతారు. ఆడపిల్లల విషయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ. అలాకాకుండా ఉండాలంటే...

Published : 26 May 2023 00:01 IST

ఉద్యోగాల్లో కుదురుకునే వరకూ... సరదాగా గడిపేసే యువత ఆ తర్వాత పని ఒత్తిడి అంటూ సతమతమవుతారు. ఆడపిల్లల విషయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ. అలాకాకుండా ఉండాలంటే...

* కాలేజీలో ఉన్నప్పుడు షికార్లకు వెళ్లి సేదతీరడం ఎంతో సంతోషంగా ఉండేది కదా! మరి మీలాంటి అభిరుచులున్న స్నేహితులతో కలిసి వారాంతంలో సరదాల కోసం ప్రణాళిక వేసుకోండి. ముఖ్యంగా ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌, టెన్నిస్‌, వాకింగ్‌... దేన్నైనా ఎంచుకోవచ్చు. ఇవి శరీరాన్నే కాదు... మనసునీ ఉత్సాహపరుస్తాయి.

* ఉద్యోగంలో చేరాక వ్యాయామం నుంచి నిద్రవరకూ అన్నింటికీ సరైన సమయం కేటాయించుకోగల ప్లాన్‌ మీ దగ్గర ఉంటే చాలు... హాయిగా గడిపేయొచ్చు. పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్య క్రమాన్ని అలవరుచుకోవడం వల్ల ఎప్పటి పనిని అప్పుడు పూర్తిచేయగలగుతారు. దీంతో ఒత్తిడి దరి చేరదు.

* ఉద్యోగంలో చేరాక ఆదాయానికీ, ఖర్చులకీ మధ్య సమతూకం పాటించాలి. అంటే సంపాదనలో కనీసం పాతికోవంతు పొదుపు చేయగలగాలి. ఆరోగ్యానికీ, అత్యవసరానికీ కూడా కేటాయించుకోవాలి. అప్పుడే ఆర్థిక భరోసా కలుగుతుంది.

* ఉద్యోగంలో చేరగానే మీ లక్ష్యాన్ని చేరుకున్నామనుకుని సంబరపడిపోకండి. ముందు, ముందు సవాళ్లను ఎదుర్కోకూడదంటే ఎప్పటికప్పుడు అప్‌టుడేట్‌గా ఉండాలి. అప్పుడే అసంతృప్తి దరిచేరకుండా సంతోషంగా సాగిపోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్