ఆ సఖ్యత కావాలంటే...
ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేసే రోజులివి. సహజంగానే కాస్తంత ఎక్కువ భావోద్వేగాలతో సతమతమయ్యే మహిళలు... సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటిస్తే మేలంటారు నిపుణులు.
Updated : 16 Jun 2023 00:47 IST
ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేసే రోజులివి. సహజంగానే కాస్తంత ఎక్కువ భావోద్వేగాలతో సతమతమయ్యే మహిళలు... సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటిస్తే మేలంటారు నిపుణులు.
- నవ్వితేనే... పని వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటేనే ఎటువంటి విసుగూ లేకుండా రోజు హాయిగా గడిచిపోతుంది. అలాకాకుండా చిన్న చిన్న కారణాలకే అవతలి వారిని తప్పించుకుని తిరగడం, వారి మీద చికాకు పడటం, అసహనాన్ని ప్రదర్శిస్తుండటం వంటివి చేస్తే.. స్వేచ్ఛగా పలకరించుకునే వాతావరణాన్ని కోల్పోతాం. కార్యాలయానికి రాగానే... పలకరింపుగా ఓ చిరునవ్వు చాలు... సఖ్యత పెరగడానికి అన్నది గుర్తుంచుకోండి.
- తగ్గి చూడండి: సహచరుల వ్యక్తిత్వం ఏదైనా సరే... మీరు మీలానే ఉండండి. పనిలో పోటీ... కొన్నిసార్లు అసూయ, ద్వేషాలకు కారణం అవుతుంది. అంత మాత్రాన వారు మీకేమీ శత్రువులు కాదు. ఏదైనా ఆ పని వరకే అని అర్థం చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. మీ మధ్య మనస్పర్థలు వస్తే తొలగించుకోవడానికి మొదటి అడుగు మీరే వేయండి.
- తోడుగా: ఒకరితో మాట్లాడకపోయినా.. స్నేహ పూర్వకంగా మెలగకపోయినా వచ్చే నష్టం తక్కువే. కానీ ఇతరులకు గౌరవం ఇవ్వకుంటే మాత్రం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అందరితో మర్యాదగా మెలగండి. ఎవరైనా పలకరించినప్పుడు సరిగ్గా స్పందించండి. ఇవన్నీ ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించేవే. అంతే కాదు ఇవన్నీ మీ పట్ల గౌరవభావాన్నీ పెంచుతాయి.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.