నైపుణ్యం పెంచుకుంటే మీరే విజేత
జీవితంలోనూ, కెరియర్‌లోనూ ముందుకెళ్లాలంటే మీకంటూ కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అందుకోసం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం.
జీవితంలోనూ, కెరియర్‌లోనూ ముందుకెళ్లాలంటే మీకంటూ కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అందుకోసం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం.
♥ ఏం చేయాలనుకున్నా మీ బలం, బలహీనత ఏంటో తెలిసుండాలి. ఏ రంగంలో మెరుగ్గా ఉన్నారో అంచనా వేసి దానికి తగిన విధంగా స్కిల్‌ను మెరుగు పరచుకోవాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో వాటిపై మరింత శ్రద్ధ చూపండి. లేదా పూర్తిగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి.
♥ మీరు ఏ స్కిల్ ఎంచుకున్నా కెరియర్‌కు ఉపయోగపడే విధంగా ఉండాలి. తీసుకునే శిక్షణ మీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ విషయంలో అనుమానం ఉంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి.
♥ మీ పనితీరు బాగా లేదని బాస్ చెప్పినప్పుడు దానిని సానుకూలంగా స్వీకరించగలగాలి. ఏ విషయంలో మెరుగుపడాలో గమనించుకుని, వాటిపై ఇంకాస్త శ్రద్ధ వహించాలి.
♥ నైపుణ్యాలను నేర్చుకోవడమే కాదు. వాటిని ఆచరణలోనూ పెట్టాలి. అప్పుడే ముందుకు సాగగలం. వస్తువులను వాడకుండా వదిలిస్తే తుప్పు పట్టిపోయినట్టు, నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టకపోయినా నిరుపయోగం అవుతాయి.
♥ ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా శిక్షణలో మెరుగులు దిద్దుకోవాలి. అప్పుడే ఉన్నత స్థానానికి వెళ్లగలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.