మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు.

నీకే పని చేతకాదంటూ బృందసభ్యురాలు తిట్టిందనో, ఒక్క నివేదిక కూడా బాలేదని బాస్‌ చీవాట్లు పెట్టాడనో మనసు చిన్నబుచ్చుకుని మనం తెగ బాధపడిపోతుంటాం.

Published : 17 Sep 2023 01:38 IST

నీకే పని చేతకాదంటూ బృందసభ్యురాలు తిట్టిందనో, ఒక్క నివేదిక కూడా బాలేదని బాస్‌ చీవాట్లు పెట్టాడనో మనసు చిన్నబుచ్చుకుని మనం తెగ బాధపడిపోతుంటాం. దీనివల్ల ఒత్తిడీ, ఆందోళన తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి..

  • పనులన్నీ చక్కబెట్టడానికి మనమెంత ప్రయత్నించినా కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం సాధారణం. వాటికోసం బాధపడి, కుంగిపోయి సమయాన్ని వృథా చేసుకోవడం కన్నా.. అసలు జరిగిన తప్పేంటో గుర్తించండి. దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే ఇంటా, బయటా ఎలాంటి అసంతృప్తి లేకుండా జీవితం సజావుగా సాగిపోతుంది.
  • మనమెంత శ్రమపడినా కావాలనే తిట్టేవారు కొందరుంటారు. అలాంటి వారిని పట్టించుకోకండి. వారికి, వాళ్ల మాటలకు వీలైనంత దూరంగా ఉండండి. అప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
  • మనం చేసే పనేదైనా తప్పొప్పులను సరిచూసుకుని ఇస్తుంటాం. మన బెస్ట్‌ ఇచ్చినా కొన్నిసార్లు దానిలో పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటప్పుడు దాన్ని ఒక పాఠంగా తీసుకోవాలే తప్ప.. అదే ఆలోచిస్తూ దాని ప్రభావం ఇంకోదానిపై పడేట్లు నడుచుకోవడం సరైన పద్ధతి కాదు.
  • ఆఫీసుకు వెళ్లి ఇంట్లో జరిగిన విషయాల గురించి, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసులో ఎదురైన ఘటనల గురించి ఆలోచిస్తుంటాం. ఇది మీ పనికి విఘాతం కలిగిస్తుందే తప్ప మీ సమస్యలకు పరిష్కారం చూపించదు. ఎక్కడి విషయాలు అక్కడికే పరిమితం కావాలి.
  • శ్రమకు తగిన గుర్తింపు దక్కడం లేదు. కావాలనే ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయండి. వాళ్లు సమస్యను పరిష్కరిస్తారు. అంతేకానీ మనలో మనం మదన పడితే ఏ సమస్యా తీరదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్