చిన్నారులు మొబైల్‌కి దూరంగా..

నేటి కాలంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్లకి అలవాటు పడిపోతున్నారు. వీటి వల్ల ఉపయోగం ఎంత ఉందో సమస్యలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి.

Updated : 22 Oct 2023 04:11 IST

నేటి కాలంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్లకి అలవాటు పడిపోతున్నారు. వీటి వల్ల ఉపయోగం ఎంత ఉందో సమస్యలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి.

తల్లిదండ్రులుగా మనం కూడా పనులకు ఆటంకం కలగకూడదని చిన్నారులకి మొబైల్‌ ఇస్తుంటాం. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే తరం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ అలవాటు కట్టడి చేయాలంటే మనమూ కొన్ని పద్ధతులను అలవాటు చేసుకోవాలి.

  • పిల్లలు ఎంత సమయం మొబైల్‌ ఫోను వాడుతున్నారు అనే విషయం గమనించాలి. రోజులో అరగంటకు మించి ఫోను వాడనివ్వకూడదు. దానికీ నిర్ణీత సమయాన్ని కేటాయించండి. ఇలా చేయడం వల్ల నెమ్మదిగా మొబైల్‌ వాడకం తగ్గి వారిలో ఒత్తిడి కూడా తగ్గుతుంది.
  • ఫోను అతిగా వాడితే వచ్చే అనర్థాలను వారికి వివరించాలి. కంటి సమస్యలు వస్తాయని, బదులుగా వ్యాయామం, యోగా వంటివి చేస్తే శారీరక, మానసిక సమస్యలు దూరమవుతాయని వివరించండి.
  • స్క్రీన్‌టైమ్‌ని తగ్గించేందుకు ఏదైనా పుస్తకాన్ని చదివే అలవాటు చేయించాలి. ముందు  మీరు మొదలు పెట్టండి. మిమ్మల్ని చూసి వారు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు.  అందరూ కలిసి భోజనం చేయడం, రోజువారీ కార్యకలాపాలను చర్చించడం వంటివి స్క్రీన్‌ టైంను తగ్గిస్తాయి.ఈ విధంగా ఇంటిని డిజిటల్‌ఫ్రీ జోన్‌గా మార్చుకోవచ్చు.
  • మొబైల్‌ వాడకాన్ని తగ్గించడానికి పిల్లలను ఇతర పనుల్లో బిజీగా ఉంచాలి. అలాగే చేతితో చేసే చిన్నచిన్న కళాకృతులను తయారు చేయించాలి. మీరు వారితో కలిసి ఆటలు ఆడుతూ.. ప్రోత్సహించాలి. శారీరక వ్యాయామాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తే నెమ్మదిగా ఫోనుకు దూరమవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్