ఆటతో లాభాలెన్నో!

పిల్లల మానసిక వికాసానికి చదువుతోపాటూ.. ఆటలూ అవసరమే. అందుకే రోజులో ఓ గంటైనా ఆడుకొంటే.. బోలెడు జీవన నైపుణ్యాలు అందుతాయి. అవేంటో తెలుసా?

Published : 24 Nov 2023 01:29 IST

పిల్లల మానసిక వికాసానికి చదువుతోపాటూ.. ఆటలూ అవసరమే. అందుకే రోజులో ఓ గంటైనా ఆడుకొంటే.. బోలెడు జీవన నైపుణ్యాలు అందుతాయి. అవేంటో తెలుసా?

టీమ్‌ వర్క్‌: జట్టు గెలవాలంటే వాళ్ల ఒక్కరి కష్టమే సరిపోదు. తోటి పిల్లలూ గెలవడానికి సాయం చేయాలి. అందరూ ఒక్కటైతేనే విజయం దక్కుతుందనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో పిల్లలకి తోటిపిల్లలతో మెలగడం ఎలానో తెలుస్తుంది. సమష్టితత్వంలో ఉండే గొప్పతనం అర్థమవుతుంది. దాంతోపాటు గెలుపోటములు ఎంత సహజమో తెలుసుకుంటారు. కష్టనష్టాలు వచ్చినా సరే తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుకుంటారు.

ఏకాగ్రత పెరుగుతుంది: ఆటల్లో వేగం, హుషారే కాదు అంతకుమించి ఏకాగ్రత కూడా అవసరం. ఆటల్లో అలవడిన ఏకాగ్రత.. చదువుల్లోనూ ఉపయోగపడుతుంది. గేమ్స్‌లో నియమ నిబంధనలు పాటించకపోతే ఔట్‌. జీవితంలోనూ ఆ క్రమశిక్షణ లేకపోతే దారితప్పుతామని పిల్లలకు చెప్పాలి. 

నాయకత్వ లక్షణాలు: ఆడటంతో పాటు.. జట్టు గెలవడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవటం తెలిస్తే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఇవే పిల్లలకు స్కూల్లో, పెద్దయ్యాక ఉద్యోగాల్లో, వ్యక్తిగత బంధాల విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటితోపాటు సమయపాలన అలవడుతుంది. చదువులు, వ్యక్తిగత ఆసక్తులు, ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వంటి వాటిని సమన్వయం చేసుకుంటారు.

క్రమశిక్షణతో: ఆటల్లో నెగ్గాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. పిల్లలు ఆటల్లో ఉంటే వాళ్లు సహజంగానే ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడతారు. వీటితోపాటు స్నేహబంధాలు ఏర్పరుచుకోవటం, ఒకరికొకరు అండగా నిలవటం, కలసి పనిచేయటం వంటివి అర్థం చేసుకుంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్