ఆ జ్ఞాపకాలని పాతరేద్దాం!

ప్రేమ.. ఈ బంధం సజావుగా సాగితే అంతా బాగానే ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితులు ఎదురై బ్రేకప్‌ వరకూ వెళ్తే? కొంతమంది ఆ చేదు జ్ఞాపకాల నుంచి తేలిగ్గానే బయటపడతారు. మరికొందరు మాత్రం నైరాశ్యంలో కూరుకుపోతారు..

Published : 24 Nov 2023 01:33 IST

ప్రేమ.. ఈ బంధం సజావుగా సాగితే అంతా బాగానే ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితులు ఎదురై బ్రేకప్‌ వరకూ వెళ్తే? కొంతమంది ఆ చేదు జ్ఞాపకాల నుంచి తేలిగ్గానే బయటపడతారు. మరికొందరు మాత్రం నైరాశ్యంలో కూరుకుపోతారు.. 

  • మొదట్లో ఈ పరిస్థితిని తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. నెమ్మదిగా పరిస్థితులు చక్కబడతాయి. అంత వరకూ ఒంటరితనంలో కూరుకుపోయి.. పాత జ్ఞాపకాల్ని మళ్లీమళ్లీ మననం చేసుకొనే బదులు నచ్చిన అభిరుచివైపు మనసుని మళ్లించండి. క్రమంగా మీలో మార్పు రావొచ్చు. అందరితో కలిసి సరదాగా గడపడం, షాపింగ్‌ చేయటం వంటివి చేయాలి.
  • వాళ్ల జ్ఞాపకాలు మీ చుట్టూ ఉన్నంత సేపూ అవి మిమ్మల్ని ముళ్లులా గుచ్చుతూనే ఉంటాయి. అందుకే వాళ్లని గుర్తుచేసే ఏ విషయాలనైనా పూర్తిగా వదిలించుకోండి.
  • ఎవరిమీదో కోపంతో భోజనం మానేయడం, ఇంట్లో వాళ్లని బాధపెట్టడం ఎంత వరకూ సమంజసం చెప్పండి? మనల్ని అమ్మానాన్నలకంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు? ఈ విషయం మీరు గ్రహిస్తే అమ్మని బాధపెట్టరు కదా! లేదంటే మీరే ఇష్టమైన వంటలు చేసి ఇంటిల్లిపాదినీ ఖుష్‌ చేసేయండి. మనసు తేలిక పడుతుంది.
  • మీరనుకున్న వ్యక్తి దక్కకపోతే జీవితానికి అదే ఆఖరి మజిలీ కాదు. అలాగే వెంటనే మరో బంధంలోకి అడుగుపెట్టడమూ పరిష్కారం కాదు. మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో అటువైపుగా అడుగులు వేస్తూ కెరియర్‌ను విజయవంతం చేసుకోండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్