సమయం సరిపోవడం లేదా...

వంటావార్పూ, పిల్లలు, ఆఫీసు అంటూ క్షణం కూడా తీరికలేకుండా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు మహిళలు. కానీ, వ్యాయామం, తోటపని వంటి పనుల్ని మాత్రం వాయిదా వేస్తుంటారు.

Published : 02 Dec 2023 01:34 IST

వంటావార్పూ, పిల్లలు, ఆఫీసు అంటూ క్షణం కూడా తీరికలేకుండా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు మహిళలు. కానీ, వ్యాయామం, తోటపని వంటి పనుల్ని మాత్రం వాయిదా వేస్తుంటారు. ఇందుకు సమయం లేదని చెప్పొద్దనీ... ఇలా కూడా సద్వినియోగం చేసుకోవచ్చనీ చెబుతున్నారు నిపుణులు....

రోజుని సరిగ్గా వినియోగించుకోవడం కూడా నైపుణ్యాల్లో భాగమే. మర్నాడు చేయబోయే పనులేంటన్న ఆలోచనల్ని ఓ కొలిక్కి తెచ్చుకోవాలి. అందుకు కావాల్సిన సామగ్రినంతా ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. పిల్లల యూనిఫాం, షూ, పుస్తకాల బ్యాగులు అన్నీ సిద్ధం చేసుకోవడం, కూరగాయలు తరిగి పెట్టుకోవడం వంటివన్నీ రాత్రే పూర్తి చేసుకోవాలి. అలాగని ఇవన్నీ చేస్తూ అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండొద్దు. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. దీంతో హడావుడి లేకుండా పనులూ పూర్తవుతాయి. చాలా సమయం మన చేతిలో ఉన్నట్లే అనిపిస్తుంది. దీన్ని వ్యాయామానికీ, ఇతర వ్యాపకాలకూ కేటాయించుకుంటే సరి.

 అలారంతో..

 పనెంత త్వరగా మొదలుపెట్టినా.. అది పూర్తయ్యేసరికి సమయం మించిపోతుందనే వేదన చాలా మందిలో ఉంటుంది. ఇందుకు ప్రణాళికాలోపం, స్మార్ట్‌ వర్క్‌ చేయకపోవడమే కారణం. ముందుగానే మసాలాలు నూరిపెట్టుకోవడం, ముక్కలు కోసి ఉంచుకోవడం వంటి వాటివల్ల టైం కలిసి వస్తుంది. అంతేకాదు, ఏ పనిని ఎప్పుడు ముగించాలో ముందే నిర్ణయించుకోవాలి. దాన్ని గుర్తు చేయడానికి అలారం పెట్టుకుని వేగం పెంచుకోండి. ఇలా కొన్ని రోజులు చేస్తే మీరు ఆ పద్ధతికి అలవాటు పడతారు. పిల్లల్ని రెడీ చేయడానికీ, ఆఫీసుకి వెళ్లడానికీ కూడా దీన్ని అమలు చేస్తే ... సమయం మించిపోతుందన్న ఒత్తిడీ, ఆందోళనల్ని దాటేయొచ్చు.

వారాంతంలో..

ఒకేసారి అన్ని పనులూ చేయడం అవ్వకపోవచ్చు. పండగలప్పుడు రెండు మూడు వారాల ముందు నుంచే రోజుకో గది శుభ్రం చేయాలని పెట్టుకోండి. తోటపనిని వ్యాయామంగా భావించి ఉదయమో, సాయంత్రమో ఓ అరగంట కేటాయించుకోండి. ఇవి మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. సంతోషాన్నీ అందిస్తాయి. దీంతో మనసు ప్రశాంతంగా మారి శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్