చలికి స్మార్ట్‌ పరిష్కారం!

ఏ కాలమైనా మనకా పొద్దున్నే లేవక తప్పదు. శీతగాలులకేమో వణుకొచ్చేస్తుంది. అలాంటప్పుడు ఒంటికి వెచ్చదనం తగులుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! అయితే ఈ స్మార్ట్‌ గ్యాడ్జెట్లను తెచ్చేసుకోండి.

Published : 08 Dec 2023 01:40 IST

ఏ కాలమైనా మనకా పొద్దున్నే లేవక తప్పదు. శీతగాలులకేమో వణుకొచ్చేస్తుంది. అలాంటప్పుడు ఒంటికి వెచ్చదనం తగులుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! అయితే ఈ స్మార్ట్‌ గ్యాడ్జెట్లను తెచ్చేసుకోండి.

  • గ్లవుజులు... బయట చలి ఎక్కువగా ఉంటే మొదట ప్రభావం కనిపించేది చేతుల మీదే. ఇలాంటప్పుడు ఈ గ్లవుజులు సాయపడతాయి. ఒకసారి ఛార్జింగ్‌ పెడితే ఆరు గంటలు చేతులను వేడిగా ఉంచుతాయి. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరం బ్యాటరీతో నడుస్తుంది. ఉష్ణోగ్రతలను రిమోట్‌ సాయంతో సమన్వయం చేసుకోవచ్చు. ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌ల మీద పనిచేస్తున్నప్పుడు యూఎస్‌బీ సపోర్ట్‌తో వేడి చేసుకునే మరికొన్ని గ్లవుజుల రకాలూ అందుబాటులో ఉన్నాయి. నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
  • సాక్సులు... చలికి పాదాలు చల్లబడి కొన్నిసార్లు అడుగులు సైతం పడవు. ఇలాంటప్పుడు ఈ ‘థర్మోస్టాట్‌ సాక్సు’లను ప్రయత్నించండి. వీటికి పైభాగంలో బ్యాటరీలతో అమర్చిన చిన్న పరికరం వేడిని పుట్టిస్తుంది. సాక్సుల్ని వెచ్చగా ఉంచుతుంది. ఒకసారి చార్జింగ్‌ పెడితే 12 గంటలు పనిచేస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్