పొరపాటు చేశా... సారీ!

పిల్లాడికి బాక్సు ఇవ్వడం మర్చిపోయినా, చేస్తానని ఏదైనా మర్చిపోయినా, మనకు నచ్చింది కాస్త ఖర్చు ఎక్కువపెట్టి కొన్నా, ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా రాలేకపోయినా... వేరెవరో మనల్ని ఒక మాట అనక్కర్లేదు కదూ! మనకు మనమే పెద్ద తప్పు చేశామని భావిస్తాం. లెక్కలేనన్ని సారీలతో ఎదుటివారిలోనూ ఏదో అపరాధం చేశామన్న భావన కలిగిస్తాం.

Updated : 02 Feb 2024 02:38 IST

పిల్లాడికి బాక్సు ఇవ్వడం మర్చిపోయినా, చేస్తానని ఏదైనా మర్చిపోయినా, మనకు నచ్చింది కాస్త ఖర్చు ఎక్కువపెట్టి కొన్నా, ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా రాలేకపోయినా... వేరెవరో మనల్ని ఒక మాట అనక్కర్లేదు కదూ! మనకు మనమే పెద్ద తప్పు చేశామని భావిస్తాం. లెక్కలేనన్ని సారీలతో ఎదుటివారిలోనూ ఏదో అపరాధం చేశామన్న భావన కలిగిస్తాం. నిజంగా ఇవన్నీ కావాలనే చేశామా? లేదు కదా. కాబట్టి...

  • అసలీ ‘గిల్ట్‌’కి కారణమేంటి? లోపల్నుంచి వస్తోందా? బయటి వ్యక్తులు కారణమా అనేది తెలుసుకోండి. మీకు మీరే తెచ్చుకుంటున్నది అయితే, ‘రాలేకపోయాను, చేయలేకపోయాను’ అనుకున్నప్పుడు ‘ఎందుకు’ అన్న ప్రశ్ననీ వేసుకోండి. కావాలని చేయకపోతే ‘కొన్నిసార్లు ఇంతే. అలా జరిగిపోతుంది’ అని మీకు మీరే సర్దిచెప్పుకోండి. తర్వాత చేయాల్సిందేంటో ఆలోచించండి. అప్పుడు బాధా తగ్గుతుంది, తక్షణ పరిష్కారమూ దొరుకుతుంది.
  • ఇల్లు గడవడానికి మీ జీతం తప్పనిసరా? అలాంటప్పుడు అమ్మ బాధ్యత నిర్వర్తించలేక పోతున్నా అని బాధపడొద్దు. పిల్లలు చిన్నతనంలో అమ్మ ప్రేమ కోరుకోవడంలో తప్పు లేదు. అది తగినంత అందివ్వలేనప్పుడు బాధా సాధారణమే. ముందు మీకు మీరే ‘సారీ నాన్నా, నీకు సమయం ఇవ్వలేకపోతున్నా’ అంటూ వారిలో నెగెటివ్‌ ఆలోచనలు నింపొద్దు. బదులుగా మీరెవరి కోసం ఇంత కష్టపడుతున్నారో చెప్పండి. మీమీద గౌరవం ఏర్పడటమే కాదు, పిల్లలకి బాధ్యతా అలవాటు అవుతుంది. ఈ ‘గిల్ట్‌’ సమయమేదో వాళ్లతో గడపడమెలా అని ఆలోచిస్తే మరింత ప్రయోజనం కూడా.
  • ఉద్యోగినులకే ఈ అపరాధ భావన అనుకుంటాం కదా! గృహిణులనీ ఈ సమస్య వేధిస్తోంది అంటున్నాయి అధ్యయనాలు. ‘ఆమె చూడు చక్కగా సంపాదిస్తోంది’, ‘వాళ్లు చూడు పిల్లలకు చక్కగా పాఠాలు నేర్పిస్తున్నారు’, ‘నేను రావడం నా పిల్లలకు అవమానం’ అంటూ రకరకాల కారణాలతో బాధపడిపోతున్నారట. ‘ఖాళీగా ఉన్నా, మిగతావారి కంటే నేను తక్కువ’న్న భావన రావడమే ఇందుకు కారణం. అమ్మ పనికి లెక్క లేదన్న మాట ముందు మీరు అర్థం చేసుకుని, వాళ్లూ గ్రహించేలా చెప్పండి. చిన్నవాళ్లు అని ఆలోచించక పనులు అప్పజెబితే సరి. వీలుంటే తెలియని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడీ ‘గిల్ట్‌’ మీ దరిదాపులకు రాదు... ఏమంటారు?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్