పింక్‌ ట్యాక్స్‌ కడుతున్నారా?

ఇంటిపన్ను, గ్రంథాలయ పన్ను, రోడ్డుపన్ను, ఆదాయపన్ను ఆఖరికి జీఎస్‌టీ గురించి కూడా చాలామందికి తెలుసు. కానీ మీరెప్పుడైనా పింక్‌ ట్యాక్స్‌ గురించి విన్నారా? ఇది ప్రభుత్వం వసూలు చేసే ఏ ట్యాక్స్‌ కేటగిరీలోకీ రాదు.

Published : 02 Feb 2024 01:45 IST

ఇంటిపన్ను, గ్రంథాలయ పన్ను, రోడ్డుపన్ను, ఆదాయపన్ను ఆఖరికి జీఎస్‌టీ గురించి కూడా చాలామందికి తెలుసు. కానీ మీరెప్పుడైనా పింక్‌ ట్యాక్స్‌ గురించి విన్నారా? ఇది ప్రభుత్వం వసూలు చేసే ఏ ట్యాక్స్‌ కేటగిరీలోకీ రాదు. మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్‌, ప్యాకేజీ చేసిన ఉత్పత్తులకు మాత్రమే వర్తించే పన్ను ఇది. ప్రత్యక్షంగా మన పర్సుల్లోంచే కట్టినా ఎవరికీ కనిపించనిదే ఈ పింక్‌ ట్యాక్స్‌. కేవలం స్త్రీలు కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలకే చెల్లించాల్సి రావడం వివక్షే అంటారు మహిళా హక్కుల వాదులు. ఇదేదో ఊహాజనితంగా చెప్పేసిన విషయమూ కాదు. కొన్నేళ్ల కిత్రం న్యూయార్క్‌ సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కన్స్యూమర్‌ అఫైర్స్‌ ‘ఫ్రమ్‌ క్రెడిల్‌ టూ క్రేన్‌’ పేరుతో చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ సర్వే కోసం సుమారు 800కు పైగా ఉత్పత్తుల ధరలను పోల్చి చూశారు. అందులో ఆడ, మగ ఇద్దరికోసం వేర్వేరుగా తయారు చేసిన ఒకే రకమైన ఉత్పత్తులను సరిచూస్తే ఇందులో విమెన్‌ ప్రొడక్ట్స్‌ ధర ఏడు శాతం ఎక్కువ. అదే పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తుల విషయానికి వస్తే ఇది పదమూడు శాతంగా ఉంది. మరింత లోతుగా పరిశీలిస్తే- భారతదేశంతో సహా  ప్రపంచ దేశాల మహిళలందరూ ఈ గులాబీ పన్నుని చాలా వాటికి చెల్లిస్తున్నారని తెలిసింది. స్త్రీలకు ప్రత్యేకం అనే పేరుతో సౌందర్య సేవలు, కాస్మెటిక్స్‌ ఉత్పత్తుల ఖరీదులు... ఒకటేమిటి అన్నింటిలోనూ ఈ తేడా కనిపిస్తోంది. ఈ అధిక చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవాలంటే...  ప్రయోజనం ఉంటే తప్ప, గులాబీ రంగులో ప్యాక్‌ చేసిన వస్తువులను ఎంచుకోకుండా ఉంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్