కొలువు పోవొద్దంటే..

‘ఇక మీ సేవలు చాలు, రేపట్నుంచి మీరు ఆఫీసుకు రావాల్సిన పనిలేదు’ ఎన్నో ఆశలతో కొలువులోకి అడుగు పెట్టిన అమ్మాయికి ఈ మాటలు ఎంత బాధిస్తాయో కదా? ద్రవ్యోల్బణం, ప్రాజెక్టులు రావడం లేదంటూ పెద్ద సంస్థలూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Updated : 11 Feb 2024 03:41 IST

‘ఇక మీ సేవలు చాలు, రేపట్నుంచి మీరు ఆఫీసుకు రావాల్సిన పనిలేదు’ ఎన్నో ఆశలతో కొలువులోకి అడుగు పెట్టిన అమ్మాయికి ఈ మాటలు ఎంత బాధిస్తాయో కదా? ద్రవ్యోల్బణం, ప్రాజెక్టులు రావడం లేదంటూ పెద్ద సంస్థలూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆ జాబితాలోకి మీరు రావొద్దంటే...

  • గుంపులో గోవిందలా చేసుకుంటూ వెళ్లేవాళ్లు చాలామందే దొరుకుతారు. ఇక మీరే ఎందుకు? ‘ఈ పని తనైతేనే చేయగలదు, తను లేకపోతే ఎలా’ అన్న అభిప్రాయం మీమీద ఉందా? లేదంటే చెప్పిందే చేస్తా అన్నట్లుగా ఉంటారా? మనది అనుకుని బాధ్యత తీసుకునే వాళ్లకే పని ప్రదేశంలో ప్రాధాన్యం ఉంటుంది. ఎదురెళ్లి పని అందుకోవడం, తలలో నాలుకలా మెలగడం లాంటి లక్షణాలు ఉన్నాయేమో చెక్‌ చేసుకోండి.
  • అందరూ అన్ని పనులూ చేయలేరు. కానీ కనీస ప్రయత్నం చేయాలి కదా! ప్రయత్నించి, చేయలేకపోతే సరే. అలాకాకుండా ముందుగానే ‘నా వల్ల కాదు, నేను చేయలేను’ అంటోంటే తప్పించుకునే తత్వంగానే భావిస్తారు. అలాంటప్పుడు మీ అవసరమేంటి?
  • ఇంతకీ ఎప్పుడైనా పొరపాట్లు చేశారా? పనన్నాక అడపాదడపా ఇలాంటివి సహజమే కదూ! అలాగని ఆ భయంతో పని తప్పించుకోవడం లేదు కదా? తప్పు జరిగినప్పుడు చీవాట్లు సహజమే. కానీ ఇది నేర్చుకునే క్రమంలో భాగమే. దాన్ని మరోసారి జరగకుండా చూసుకున్నారా... మీరు నేర్చుకుంటున్నట్లే. లేదని తప్పించుకుంటూ వెళుతున్నారో పని చేయని వారికిందే లెక్కేస్తారు.
  • ఇతరులతో ఎలా ఉంటారు? ఇతరుల పొరపాట్లను ఎత్తిచూపడం, వారి వెనక చెడుగా మాట్లాడటం మొదట్లో అందరూ సహిస్తారు. నెగెటివిటీని పెంచుతున్నారన్న అభిప్రాయం కలిగిందో మిమ్మల్ని దూరం పెట్టడానికే చూస్తారు. కాబట్టి... ఈ లక్షణాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటూ, సంస్థకు మీ అవసరం ఉందనేలా ఎదగండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని వదులుకుంటారు చెప్పండి?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్