మనతో మనం...

మనలో చాలామందికి ఒక్కరే ఉండాలంటే బోరింగ్‌. చేతిలో ఫోన్‌..లేకుంటే ఎవరో ఒకరు తమతో మాట్లాడుతూ ఉండాలనీ, కబుర్లు చెబుతూ ఉండాలనీ అనుకుంటుంటారు. మీరూ అలానే ఆలోచిస్తున్నారా!

Updated : 16 Feb 2024 05:52 IST

మనలో చాలామందికి ఒక్కరే ఉండాలంటే బోరింగ్‌. చేతిలో ఫోన్‌..లేకుంటే ఎవరో ఒకరు తమతో మాట్లాడుతూ ఉండాలనీ, కబుర్లు చెబుతూ ఉండాలనీ అనుకుంటుంటారు. మీరూ అలానే ఆలోచిస్తున్నారా!

ఇంటిపని, ఉద్యోగం... ఏ పనులైనా సరే పరిపూర్ణంగా చేయాలంటే ఏకాంతం, పనిపై శ్రద్ధ ఉండాలి. ఇక ఈ డిజిటల్‌ యుగంలో మన దృష్టిని మరల్చే సాధనాలే ఎక్కువ. మరి వీటన్నింటినీ జయించాలంటే మనసు స్థిరంగా ఉంచుకోవాల్సిందే. యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా పరిశోధన ప్రకారం సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లు ఒంటరిగా ఉన్నా బోర్‌గా ఫీలవకుండా, తమ ఆలోచనలపైనే దృష్టి పెడతారట. కొత్తగా ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటారు. అందుకే కొవిడ్‌ సమయంలో పరిస్థితులు ఎక్కువమందికి ఒత్తిడి కలిగిస్తే...వీళ్లు మాత్రం ఏ ఇబ్బందీ లేకుండా ఉండగలిగారట. ఈ టెక్‌ ప్రపంచంలో మనతో మనం సమయం గడపగలిగీ, ఆలోచనలపై దృష్టి పెట్టగలిగితే అనుకున్న లక్ష్యాలను తేలిగ్గా సాధించగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్