పని సాగాలా... డెస్క్‌ తుడవండి!

అలా ఆఫీసులోకి అడుగుపెట్టామో లేదో... బోలెడు పని ఎదురు చూస్తుంటుంది. ఇక తుడవడం లాంటివన్నీ పెట్టుకోవాలా? అయినా అది మా పని కాదు.. అనిపిస్తోందా! కానీ ఒత్తిడి పెంచే వాటిల్లో ఇదీ ఒకటి అట.

Published : 29 Feb 2024 01:54 IST

అలా ఆఫీసులోకి అడుగుపెట్టామో లేదో... బోలెడు పని ఎదురు చూస్తుంటుంది. ఇక తుడవడం లాంటివన్నీ పెట్టుకోవాలా? అయినా అది మా పని కాదు.. అనిపిస్తోందా! కానీ ఒత్తిడి పెంచే వాటిల్లో ఇదీ ఒకటి అట. కాబట్టి... అదనపు శ్రమ అనుకోకుండా దీనిపైనా దృష్టిపెట్టండి.

  • అందుబాటులో ఉండాలి అని ఫైల్స్‌, పేపర్లు వగైరా అన్నీ పక్కన పెట్టుకుంటూ ఉంటాం. తీరా చూస్తేనేమో డెస్క్‌ అంతా నిండిపోయి కనిపిస్తుంది. గజిబిజి ప్రదేశం మనసునీ చిరాకు పెడుతుంది. కాబట్టి, వీటిని మార్చడం కష్టం అన్నవి మినహా మిగిలినవన్నీ తీసేయండి.
  • సిస్టమ్‌ శుభ్రత క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ది అనేసుకుంటాం. బాగానే ఉంది కానీ... పని మధ్యలో ఎప్పుడో వేళ్లను చూసుకున్నప్పుడు మురికిగా కనిపించడం, డెస్క్‌ మీద చిన్న మరక లాంటివి కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? పొరపాటున ముఖం మీద పెట్టుకున్నానా అనుకోవడం, దానిమీదకే దృష్టిమళ్లడం లాంటివి జరుగుతుంటాయి కదూ! టిష్యూ, లేదా చిన్న వస్త్రాన్ని పెట్టుకోండి. రాగానే ఒకసారి తుడిచేసుకుంటే దృష్టిమళ్లదు.
  • చాలా గుర్తుగా పెట్టాం అనుకుంటామా? తీరా అవసరానికి డ్రాలోని వస్తువులన్నీ ఎన్నిసార్లు తిరగేసినా కావాల్సిన ఫైల్‌ దొరకదు. ఆందోళన కమ్మేస్తుంది. ఇలా జరగొద్దంటే ఫలానా రోజు ఫలానాది అవసరం అనుకుంటూ ఒక వరస క్రమంలో పెట్టుకోండి. స్టాప్లర్‌, పెన్‌, పెన్సిల్‌, పిన్నులు వంటివాటిని ఒకచోట, రిఫరెన్స్‌ మెటీరియళ్లను మరోచోట ఇలా సర్దుకోండి. ఎంత తొందరలో ఉన్నా, వాటిని అక్కడే పెట్టేలా అలవాటు చేసుకుంటే సరి. 
  • చేయమన్నారు కదా అని గంటలకొద్దీ కేటాయించొద్దు. పని పెండింగ్‌లో పడుతుంది. రోజూ రాగానే ఓసారి చూసుకుని పనిలో పడిపోవాలి. వారాంతాల్లో పూర్తయిన ఫైళ్లను తొలగించడం, అనవసరమైన వాటిని కింది డ్రాలో పెట్టడం లేదా తీసేయడం వంటివి చేస్తే చాలు. పని ప్రదేశం శుభ్రంగా ఉంటుంది, మనసుకీ హాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్