కునుకు తీస్తున్నారా..!

పగటివేళ కునుకు... శిశువులకు మాత్రమే కాదు, పెద్దలకూ అవసరమే అంటున్నాయి అధ్యయనాలు. మధ్యాహ్న భోజనం తరవాత నిద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

Published : 24 Mar 2024 01:29 IST

పగటివేళ కునుకు... శిశువులకు మాత్రమే కాదు, పెద్దలకూ అవసరమే అంటున్నాయి అధ్యయనాలు. మధ్యాహ్న భోజనం తరవాత నిద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి, ఉత్పాదకత బాగుంటుందంటున్నాయి.

  • నిద్రానంతరం సృజనాత్మక పనితీరు మూడురెట్లు పెరుగుతుందట. ఇందుకు జరిపిన పరిశోధనల ప్రకారం మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోయే వ్యక్తులు లర్నింగ్‌ టెస్ట్‌లు చేసిన వారికంటే మెరుగైన పనితీరును కనబరిచారు.
  • పది నుంచి ఇరవై నిమిషాలు పాటు పగటిపూట నిద్రించడాన్ని ‘పవర్‌ న్యాప్‌’ అంటారు. ఇది ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను ప్రోత్సహిస్తుందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్సెస్‌ డైరెక్టర్‌ వెల్లడించారు. అయితే నిద్ర వేళలు మన వయసును బట్టి ఆధారపడి ఉంటాయట.
  • ‘నెలలు వయసున్న శిశువుకు సుమారు 16 గంటల నిద్ర అవసరం. 1నుంచి2 సంవత్సరాలున్న చిన్నారులకు దాదాపు 14 గంటలు, 3 నుంచి 5 వరకు 13 గంటలు, 6నుంచి12 ఉన్నవారికి 12 గంటలు, టీనేజర్లకు 10 గంటలు, పెద్దలకు ఏడుగంటలు చొప్పున నిద్ర అవసరం’ అంటారు. అయితే నిద్రలేమిని భర్తీ చేయడానికి మాత్రం న్యాప్స్‌ (మధ్యాహ్న నిద్ర)బాగా ఉపయోగపడుతుందని వివరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్