ప్రయాణాలకు... చిన్ని సాయాలు!

వేసవి... పిల్లలకు సెలవులొస్తాయి. వెంటనే గుర్తొచ్చేది ప్రయాణాలే కదూ! ఆ సమయంలో మన ఇబ్బందులు తీర్చడంలో సాయపడేవివి.

Published : 27 Mar 2024 01:13 IST

హ్యాపీ జర్నీ

వేసవి... పిల్లలకు సెలవులొస్తాయి. వెంటనే గుర్తొచ్చేది ప్రయాణాలే కదూ! ఆ సమయంలో మన ఇబ్బందులు తీర్చడంలో సాయపడేవివి...


చిటికెలో శుభ్రం...

పిల్లలతో బయటికి వెళితే చేతులు, ముఖానికి ఏదోఒకటి రాసుకుంటూనే ఉంటారు. మనం వెళ్లినా అస్తమానూ సబ్బునో, ఫేస్‌వాష్‌నో తీసుకెళ్లం. అలాంటప్పుడు శుభ్రత ఎంత కష్టమవుతుందో కదా? ఈ పోర్టబుల్‌ హ్యాండ్‌ ఫ్లవర్‌ సోప్‌, వెట్‌ వైప్స్‌ బాక్స్‌ తెచ్చుకోండి. మినీ సోప్స్‌ని చేతిలో పెట్టుకొని కాస్త తడి చేసుకొని రుద్దుకుంటే సబ్బులా పనిచేస్తుంది. నీటితో శుభ్రం చేసుకోవాల్సినపుడు వెట్‌వైప్స్‌ పనికొస్తాయి. చిన్నగా ఉంటాయి కదా... హ్యాండ్‌ బ్యాగులో చక్కగా అమరిపోతాయి.


మోత ఉండదు

ఎక్కడికెళ్లినా సొంత క్రీములు, షాంపూ వగైరా తీసుకెళుతుంటారు కొందరు. వేరేవి పడవన్న భయం, ఇతరులవి వాడటం నచ్చకపోవడం ఇలా కారణాలు చాలానే. కానీ ఎక్కువ కాలం వస్తాయి, ఖర్చు తగ్గుతుందని పెద్దవి కొనేవారే ఎక్కువ. అప్పుడు వాటిని తీసుకెళ్లడం మోత బరువేగా? ఆ ఇబ్బందిని దూరం చేస్తూ వచ్చినవే ‘ట్రావెల్‌ ఫ్రెండ్లీ కాస్మెటిక్‌ డిస్పెన్సర్స్‌’. సెట్లుగా వివిధ పరిమాణాల్లో వస్తున్నాయి. క్రీములను వీటిలో నింపేసుకొని తీసుకెళ్లడమే. వచ్చాక కడిగి పెట్టుకుంటే తిరిగి వాడుకోవచ్చు. బాగున్నాయి కదూ!


అద్దం వెతుక్కోకుండా...

వేడుకలకు ఇంటి దగ్గర్నుంచే సిద్ధమై వెళ్లామా బెంగే లేదు. అలాకాకుండా అక్కడికెళ్లి రెడీ అవ్వడమైతే తలనొప్పి మామూలుగా రాదు. అద్దం కోసం క్యూలో నిల్చున్నట్లే ఉంటుంది కదూ! ఈ ఎల్‌ఈడీ మిర్రర్‌ బాక్స్‌ తెచ్చేసుకోండి. కాస్మెటిక్స్‌, నగలు పెట్టుకోవచ్చు. బాక్స్‌కే అద్దం ఉంటుంది. పైగా ఎల్‌ఈడీ లైట్‌లో వస్తుంది కాబట్టి, వెలుతురు సరిగా లేదన్న బెంగా ఉండదు. కాస్త స్థలం దొరికితే చాలు... చక్కగా సిద్ధమైపోవచ్చు. బాగున్నాయి కదూ... మీకూ కావాలనిపిస్తే ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్