ఆడండి... పోనీ చూడండి!

మనసులో తెలియని అలజడి. వంట సమయానికి పూర్తవకపోయినా, పిల్లల పరీక్షలైనా ఆ ఒత్తిడీ మనమీదే! కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా కునుకు రాదు... ఇలాంటప్పుడు ఎంత విసుగ్గా ఉంటుందో కదా? తెలియకుండానే కోపమూ ఆవరిస్తుంటుంది.

Published : 06 Apr 2024 02:02 IST

నసులో తెలియని అలజడి. వంట సమయానికి పూర్తవకపోయినా, పిల్లల పరీక్షలైనా ఆ ఒత్తిడీ మనమీదే! కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా కునుకు రాదు... ఇలాంటప్పుడు ఎంత విసుగ్గా ఉంటుందో కదా? తెలియకుండానే కోపమూ ఆవరిస్తుంటుంది. మీకు కుక్కపిల్లలంటే ఇష్టమా? దీనికి ఇదో మంచి పరిష్కారం అంటోంది ఓ అధ్యయనం. పీఎల్‌ఓఎస్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం... కుక్కపిల్లలతో ఆడుతున్నప్పుడు మెదడు తెలియకుండానే విశ్రాంతిని పొందుతుందట. అంతేకాదు, వాటిని అందంగా ముస్తాబు చేయడం, ప్రేమగా నిమరడం వంటివి ఏకాగ్రతను కలిగిస్తాయట. పెంపుడు జంతువులు ముఖ్యంగా పప్పీలతో గడిపేవారిలో తెలియని ఉత్సాహం నిండటమే కాదు, మతిమరుపూ త్వరగా దరిచేరదంటున్నారు పరిశోధకులు. అంతా బాగానే ఉంది కానీ... వాటి పెంపకమే కష్టం. అంత సమయం, ఓపిక లేదంటారా? పోనీ వాటి వీడియోలైనా చూడమంటున్నారు. అది కూడా మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుందట. అంటే... వీలుందా పెంచుకోవచ్చు. లేదంటారా చూసి ఆనందించొచ్చు. ఎలాగైనా మనసుకు శాంతే! మీరే విధానాన్ని అనుసరిస్తారు మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్