కొరియన్‌ అబ్బాయే కావాలట..!

మా అమ్మాయి వయసు 22. డిగ్రీ పూర్తయింది. తను కొరియన్‌ సిరీస్‌లు పిచ్చిగా చూస్తుంటుంది. ప్రతి విషయాన్నీ వాళ్లతో పోల్చుకుంటోంది. ఇప్పుడు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. తనేమో కొరియన్‌ యువకుడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని మొండికేస్తోంది.

Updated : 08 Apr 2024 17:15 IST

మా అమ్మాయి వయసు 22. డిగ్రీ పూర్తయింది. తను కొరియన్‌ సిరీస్‌లు పిచ్చిగా చూస్తుంటుంది. ప్రతి విషయాన్నీ వాళ్లతో పోల్చుకుంటోంది. ఇప్పుడు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. తనేమో కొరియన్‌ యువకుడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని మొండికేస్తోంది. ఎలా నచ్చజెప్పాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు.

జానకి

యుక్త వయసులోని పిల్లలు చాలా వరకు ఊహాలోకంలో జీవిస్తుంటారు. జీవితం గురించి కలలు కంటూ కాబోయే భర్త లేదా భార్య గురించి ఊహించుకుంటూ ఉంటారు. అదీకాక ఈ మధ్య యువత కొరియన్‌, జపనీస్‌, ఇంగ్లిష్‌ల్లోని రొమాంటిక్‌ సిరీస్‌లను ఎక్కువగా చూస్తున్నారు. అందులో ఉన్న హీరో, హీరోయిన్లను తమ భాగస్వాములుగా అన్వయించుకుంటూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే తెలియకుండానే వాళ్లని తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. నిజజీవితంలో వాళ్లూ మనలాంటి వాళ్లే. వాళ్లకూ కొన్ని నియమాలు ఉంటాయన్న విషయం మరిచిపోతారు. వాస్తవానికి దూరంగా వెళ్లిపోయి, మానసికంగా అందులోనే ఉండిపోతారు. తిరిగి వాస్తవంలోకి రాలేక, మానసికంగానూ బ్యాలెన్స్‌ తప్పుతున్నారు. ఇటువంటి వారికి సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌, సైకలాజికల్‌ థెరపీలు ఇవ్వడం చాలా ముఖ్యం. వాళ్లను ఊహాలోకం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ‘రియాలిటీ ఓరియెంటెడ్‌ థెరపీ’ చేయాల్సి ఉంటుంది. వాస్తవాలకూ, ఊహలకూ మధ్య తేడా తెలియజెప్పాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వాళ్లు మామూలు స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్