ఇంటర్వ్యూలో ఇలా వద్దు...

కొంతమందికి ఇంటర్వ్యూ అంటేనే భయం, ఆందోళనలతో చెమటలు పడుతుంటాయి. మరి  ఈసమస్య నుంచి బయట పడేదెలా అంటారా... ఈ చిట్కాలు మీకోసమే...

Published : 12 Apr 2024 01:36 IST

కొంతమందికి ఇంటర్వ్యూ అంటేనే భయం, ఆందోళనలతో చెమటలు పడుతుంటాయి. మరి  ఈసమస్య నుంచి బయట పడేదెలా అంటారా... ఈ చిట్కాలు మీకోసమే...

  • చాలామంది ఇంటర్వ్యూకి కొన్ని రోజుల ముందే అన్నీ చదువుకుని, ప్రాక్టీస్‌ అయి సిద్ధంగా ఉంటారు. తీరా భయంతో తెలిసిన ప్రశ్నలకీ సమాధానం తప్పుగా చెబుతుంటారు. తరవాత అయ్యో నాకు తెలుసు కదా అనుకుంటారు. దీనికి కారణం వారు మానసికంగా సన్నద్ధం కాలేకపోవడమే. ఇలాంటి సందర్భంలోనే మన బలహీనతలను బలంగా ఉపయోగించుకోగలగాలి. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నేను అసౌకర్యంగా ఫీలవుతున్నాను అని వారికి చెప్పండి. వారే అర్థం చేసుకుంటారు. లేదా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒకసారి అద్దం ముందు సాధన చేయండి. కాస్త భయం పోతుంది.
  • ఇంటర్వ్యూకి సమయపాలన చాలా ముఖ్యం. ఆలస్యంగా వెళితే మీకు టైమ్‌ మేనెజ్‌మెంట్‌ లేదు అనుకుంటారు. మీ సమయపాలనను బట్టే ఈ ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో వారికి తెలుస్తుంది. అందుకే ఎప్పుడైనా ఇంటర్వ్యూకి 15నిమిషాల ముందు చేరుకోవడం మంచిది. అంతేకాదు, కొన్ని కంపెనీలు దుస్తుల కోడ్‌ పెడుతుంటాయి. వాటిని తప్పకుండా అనుసరించాలి. ఎందుకంటే మన డ్రెసింగ్‌ని బట్టీ కొన్నిసార్లు ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
  • ఇంటర్వ్యూలో ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. కొంతమంది కంగారులో ఫోన్‌ ఆన్‌లో పెట్టి ఇంటర్వ్యూ గదిలోకి వెళ్తుంటారు. అదేమో అప్పుడే మోగుతుంది. నిర్లక్ష్యంగా పరిగణిస్తారు జాగ్రత్త! అదేకాదు అవతలివారు  మాట్లాడుతున్నప్పుడు మీరు దిక్కులు చూసినా, అతిగా నవ్వినా క్రమశిక్షణ లేదు అనుకుని రిజెక్ట్‌ చేస్తారు. కాబట్టి లోనికి వెళ్లేముందే అన్నీ సరి చూసుకోండి. ఇంటర్వ్యూ చేసేవాళ్లపట్ల మర్యాదగా ప్రవర్తించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్