కండరాల బలానికి వశిష్ఠాసనం..!

ముందుగా నేలపై శవాసనం వేయాలి. ఇప్పుడు రెండు చేతుల మీద బరువు వేస్తూ నెమ్మదిగా శరీర పై భాగాన్ని పైకి లేపాలి. ఇప్పుడు ఫొటోలో చూపిన విధంగా, ఎడమవైపు తిరగాలి.

Updated : 20 Apr 2024 14:28 IST

ఈ ఆసనంలో శరీర బరువు ఒక చేయి, కాలు పైనే వేయడం వల్ల పొట్ట కండరాలు బలోపేతం అవుతాయి. పొత్తికడుపు దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. అండాశయానికి సంబంధించి సమస్యలు ఉంటే తొలగిపోతాయి.

ముందుగా నేలపై శవాసనం వేయాలి. ఇప్పుడు రెండు చేతుల మీద బరువు వేస్తూ నెమ్మదిగా శరీర పై భాగాన్ని పైకి లేపాలి. ఇప్పుడు ఫొటోలో చూపిన విధంగా, ఎడమవైపు తిరగాలి. తరవాత ఎడమకాలు, ఎడమచేయి మీద బరువు వేస్తూ ఒక పక్కగా పైకి లేవాలి. ఈ ఆసనం వేసేటప్పుడు మొత్తం బరువు ఒక కాలూ, చేతి మీద సమానంగా పడేలా చూసుకోవాలి. కుడికాలిని కొంచెం మడిచి నేలపై ఆనించి ఉంచాలి. కుడిచేతిని పైకిలేపి ఫొటోలో చూపిన విధంగా చాపాలి. ఈ భంగిమలో ఇరవై సెకన్ల పాటూ ఉండాలి. తిరిగి యథాస్థితికి వచ్చి కుడివైపు కూడా ప్రయత్నించాలి. రోజుకి ఐదునిమిషాలు చొప్పున చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల చేతులు, కాళ్లు, భుజాలకు సంబంధించిన కండరాలకు బలం చేకూరుతుంది.

జాగ్రత్తలు.. ఫ్రోజెన్‌ షోల్డర్స్‌, స్పాండిలైటిస్‌, మణికట్టు, చేయినొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్