ప్రతిసారీ మర్చిపోతున్నారా?

ఉదయం నిద్రలేచింది మొదలు మళ్లీ పడుకునేంత వరకూ ఇంటా, బయటా ఏదో ఒక పనితో సతమతమవుతున్న మహిళలే ఎక్కువ. యాంత్రికతకు చోటు పెరిగిపోతూ అరచేతిలో ప్రపంచాన్ని చుట్టి వస్తోన్న ఈ రోజుల్లో ఏ అప్లికేషన్ని ఉపయోగించాలన్నా గోప్యత చాలా అవసరం.

Updated : 21 Apr 2024 06:40 IST

ఉదయం నిద్రలేచింది మొదలు మళ్లీ పడుకునేంత వరకూ ఇంటా, బయటా ఏదో ఒక పనితో సతమతమవుతున్న మహిళలే ఎక్కువ. యాంత్రికతకు చోటు పెరిగిపోతూ అరచేతిలో ప్రపంచాన్ని చుట్టి వస్తోన్న ఈ రోజుల్లో ఏ అప్లికేషన్ని ఉపయోగించాలన్నా గోప్యత చాలా అవసరం. బలమైన, అన్‌బ్రేకబుల్‌ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలనే ఆలోచనతో ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం. మళ్లీ దాన్ని టైప్‌ చేయాల్సి వచ్చినప్పుడు అయ్యో! మరచిపోయామే అంటూ నాలుక కరుచుకునే సందర్భాలే బోలెడు. కొన్నిసార్లు ఉన్నది గుర్తుచేసుకోవడానికో, కొత్తది క్రియేట్‌ చేసుకోవడానికో సమయం వృథా అయి పనిమీద ధ్యాస కూడా పొగొట్టుకుంటుంటాం. అలా కాకూడదంటే...

  • సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను సృష్టించడానికి నర్సరీ రైమ్స్‌ను ఉపయోగించి చూడండి. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా ఇది ఒక మంచి పద్ధతి. మీకు ఇష్టమైన రైమ్స్‌ను ఎంపిక చేసుకోండి. రాసేటప్పుడు పదానికి మొదట అక్షరాన్ని కాపిటల్‌ ఇవ్వండి. చివర మీ అదృష్ట సంఖ్యలను జోడించండి. ఎప్పటికీ మరచిపోలేరు.
  • మీకు నచ్చిన సినిమాలో ఇష్టమైన డైలాగ్‌, పాట లేదా కోట్‌ని పైన చెప్పిన విధంగానే ఉపయోగించండి. సందర్భాన్ని బట్టి ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకాలను చేర్చండి. ఆ మాధ్యమాన్ని తిరిగి మీరు ఉపయోగించేటప్పుడు పాస్‌వర్డ్‌ టైప్‌ చేస్తుంటే మనలో ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. చేసే పనిమీదా మక్కువ పెరుగుతుంది.
  • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించేవాళ్లైతే కీబోర్డ్‌ గుర్తులను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు జె నుంచి కామా గుర్తు వరకు టైప్‌ చేస్తే సరి. ఫోన్‌ స్క్రీన్‌కి లాక్‌ వేసినట్లు కీబోర్డులో అక్షరాలను ఒక వరసన పాస్‌వర్డ్‌గా ఇవ్వొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్