నేను బాగా పనిచేయడం లేదు!

సుమతి ఆఫీసులో తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తుంది. ప్రాజెక్టు పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతుంది. అయినా తను సరిగ్గా పనిచేయలేదని బాధపడుతుంది. సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నా అనుకుంటూ కుంగుబాటుకు గురవుతుంది. ‘ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌’గా పిలిచే ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులేం చెబుతున్నారంటే...

Published : 23 Apr 2024 01:38 IST

సుమతి ఆఫీసులో తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తుంది. ప్రాజెక్టు పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతుంది. అయినా తను సరిగ్గా పనిచేయలేదని బాధపడుతుంది. సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నా అనుకుంటూ కుంగుబాటుకు గురవుతుంది. ‘ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌’గా పిలిచే ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులేం చెబుతున్నారంటే...

మనలోనే ఎక్కువ...    

ఆఫీసు పనుల్లో తాము చెప్పినంత గొప్పగా ఫలితాలను చూపించలేకపోతున్నామనే ఆలోచన, వేదన మగవారికన్నా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఈ సిండ్రోమ్‌ ఉన్నవారు ‘సరిగ్గా పనిచేయకపోయినా ఎందుకు తమను ఉద్యోగం నుంచి తీయడం లేదు’ అని ఆలోచిస్తుంటారట. అయితే ఇదేమీ మానసిక అనారోగ్యం కాదని, అందరిలోనూ అప్పుడప్పుడూ కనిపించే సమస్యే అంటున్నారు నిపుణులు. ఇటువంటి ఆలోచనల నుంచి స్వీయ ప్రయత్నంతో తేలిగ్గానే బయట పడొచ్చంటున్నారు.  

గుర్తించలేక...

ఈ సమస్య ఉన్నవారు తమలోని ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించలేరు. ఇతరుల అంచనాలకు తగ్గట్లు జీవించలేకపోతున్నామనే వేదన కూడా వీరిని వెంటాడుతుంది. ఇందుకు ఆ మహిళలు పెరిగిన వాతావరణం, బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలు కూడా కారణం కావొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. అలాగే పనిచేసే చోట లింగవివక్ష, ఆడవాళ్లు ఎక్కువ పనిచేయలేరంటూ తక్కువ బాధ్యతలు అప్పజెప్పడం వంటివీ వారిలో ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌కు దారి తీస్తాయట.

బయట పడొచ్చు...

మనల్ని ప్రభావితం చేస్తున్న భావోద్వేగాలను ముందుగా గుర్తించాలి. గతంలో సాధించిన విజయాలను వరసగా పుస్తకంలో రాయడం ద్వారా అది మన ‘పరఫార్మెన్స్‌ ట్రీ’గా మారుతుంది. అప్పుడప్పుడు దాన్ని పునఃపరిశీలన చేస్తుంటే ఆ విజయాలన్నీ మన ప్రత్యేకతను గుర్తు చేస్తుంటాయి. స్వీయ ప్రశంస నేర్చుకుంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం, యోగా వంటివి చేస్తే క్రమంగా ఈ సమస్యను దూరంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్